Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్మెంట్ ప్రకటించిన WWE స్టార్ జాన్ సీనా

డబ్యూడబ్ల్యూఈ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్. స్టార్ రెజ్లర్ జాన్ సీనా రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది జరగనున్న 'రెసిల్ మేనియా 41'తో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. 2001లో రెజ్లింగ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్ సీనా 16 సార్లు డబ్లూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా నిలిచారు.

రెజ్లింగ్‌తో పాటు నటనతోనూ జాన్ సీనా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. హాలీవుడ్ సినిమాల్లో, టీవీ షోల్లో సీనా నటించాడు. గతేడాది ఈవెంట్‌లో భాగంగా ఈ స్టార్ హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. అతన్ని చూడటానికి తెలుగు అభిమానులు ఎగబడ్డారు. ప‌వ‌ర్‌ఫుల్ పంచ్‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుడే సీనా అటాకింగ్ గేమ్‌కు అభిమానులు ఫిదా అవుతుంటారు.

John Cena Sets Final Curtain Call for 2025 WWE Retirement Announcement

దాదాపు రెండు దశాబ్దాలకుపైగా రెజ్లింగ్‌లో ఉన్న తాను ఎన్నో అనుభవాలు ఆస్వాదించానని జాన్ సీనా పేర్కొన్నాడు. ఇక వీడ్కోలు తీసుకునేందుకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు చెప్పాడు. తన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. వాళ్ల వల్లే తన కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నానని వివరించాడు. డబ్ల్యూడబ్ల్యూఈకీ ఉన్న ఆదరణను తన మాటల్లో వర్ణించలేనని జాన్ సీనా ఎమోషనల్ అయ్యాడు.

2025లో జాన్ సీనా రాయల్ రంబుల్, ది ఎలిమినేటర్ ఛాంబర్, రెసిల్ మేనియా 41లో తలపడనున్నాడు. కాగా, రెసిల్ మేనియా లాస్ వెగాస్‌లోని అల్లెజియంట్ స్టేడియంలో జరగనుంది.

Story first published: Sunday, July 7, 2024, 12:33 [IST]
Other articles published on Jul 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+