Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

50 నిమిషాల్లోనే!: మాజీ ఫార్ములా వన్ బాస్ కుమార్తె ఇంట్లో భారీ దొంగతనం

 Jewellery worth more than Rs 400 crore stolen from Tamara Ecclestones London home

హైదరాబాద్: మాజీ ఫార్ములా వన్ బాస్ బెర్నీ ఎక్లెస్టోన్ కుమార్తె తమరా ఎక్లెస్టోన్ లండన్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ప్రముఖ మోడల్ అయిన ఎక్లెస్టోన్ ఇంటి నుండి దొంగలు సుమారు 50 మిలియన్ పౌండ్లు (రూ. 473 కోట్లు) విలువైన ఆభరణాలను దొంగిలించినట్లు సన్ వార్తాపత్రిక సోమవారం ఓ కథనంలో పేర్కొంది.

క్రిస్టమస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా తమారా కుటుంబంతో కలిసి ఫిన్‌లాండ్‌ పర్యటనకు బయలుదేరిన మూడు గంటలకే ఈ దొంగతనం జరిగింది. ఇంటి వెనుక వైపు నుంచి తలుపులు బద్దలు కొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. అయితే, దొంగతనానికి సంబంధించి నిర్దిష్ట వివరాలను ధృవీకరించలేదని చెప్పారు.

వాచ్‌మెన్లు, సీసీ కెమెరాల కన్నుగప్పి దొంగలు ఇంట్లోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ దొంగతనంపై మాట్లాడేందుకు ఎక్లెస్టోన్ కుటుంబం నుండి ఎవరూ అందుబాటులో లేకపోవడం విశేషం. అయితే, "ఇది కచ్చితంగా తెలిసిన వాళ్లు చేసిన పనే" అని తమారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

Story first published: Tuesday, December 17, 2019, 13:59 [IST]
Other articles published on Dec 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+