చరిత్ర సృష్టించాడు: భారత్‌కు రెండో స్వర్ణం
రియో డీ జనీరో: రియో పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న ఆటగాళ్లు సాధించలేని ఘనతను దివ్యాంగులు సాధించి దేశ పరువు ప్రతిష్ఠలు ఇనుమడింపజేస్తున్నారు. హైజంప్‌లో తమిళనాడుకు చెందిన ఆటగాడు భారత్‌కు తొలి స్వర్ణ పతకం సాధించగా, తాజాగా జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝుఝురియా స్వర్ణం సాధించాడు.

పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో పాల్గొన్న దేవేంద్ర ఝఝారియా జావెలిన్‌ను 63.97 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో తన పేరిట ఉన్న62.15 మీటర్ల రికార్డు ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టాడు. 2004 ఏథెన్స్ పారాలింపిక్స్‌లోనూ ఝఝారియా ఈ ఘనతను సాధించాడు.
ఇప్పుడు రియోలో ప్పటి వరకు జావెలిన్ త్రోలో భారత ఆటగాళ్లు ఎవరూ చేయలేని ప్రదర్శనను చేయడం విశేషం. ఈ పతకంతో రియో పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం వచ్చి చేరాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
ఝుఝురియాకు ప్రధాని మోడీ అభినందన
రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం సాధించిన ఝుఝురియాకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. అద్భుత ప్రదర్శనతో ఝుఝురియా చరిత్రాత్మక విజయం నమోదు చేశారని పేర్కొన్నారు. జావెలిన్ త్రో విభాగంలో దేవేంద్ర ఝఝారియా బంగారు పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications