ఆసియా గేమ్స్: ఆరు స్వర్ణాలు గెలిచి చరిత్ర సృష్టించిన జపాన్ స్విమ్మర్

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులందరూ కలిసి గెలిచిన స్వర్ణ పతకాలు ఆరు. కానీ జపాన్‌కు చెందిన ఒకే క్రీడాకారిణి ఆరు స్వర్ణాలు సాధించడం విశేషం. ఆసియా గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో జపాన్‌కు చెందిన 18 ఏళ్ల స్విమ్మర్ రికాకొ ఇకీ స్వర్ణ పతకాలు సాధించింది.
శుక్రవారం మహిళల 50 మీ ఫ్రీస్టయిల్ పోటీలో ఆమె పసిడి పతకం సాధించింది. రికాకో 24.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని తన ఖాతాలో రికార్డుస్థాయిలో ఆరో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒకే గేమ్స్‌లో ఒకే ఈవెంట్‌లో ఏకంగా ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళగా రికాకొ చరిత్ర సృష్టించింది.

ఇదే ఆసియా గేమ్స్‌లో ఇంతకుముందు రికాకో ఇకీ 50, 100 మీ.బట్టర్ ఫ్లై, 100 మీ ఫ్రీస్టైల్, 4x100 మీటర్ల ఫ్రీస్టైల్, 4x100 మీటర్ల మెడ్లేలో స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. స్విమ్మింగ్‌లో చైనా, జపాన్ క్రీడాకారులు కలిసి 19 స్వర్ణాలు గెలవడం విశేషం. మొత్తంగా ఈ ఆసియా గేమ్స్‌లో ఇప్పటి వరకు చైనా 66 స్వర్ణాలు సహా 139 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇక, జపాన్ విషయానికి వస్తే 97 పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం జపాన్ ఖాతాలో 29 స్వర్ణాలు, 28 రజతాలు, 30 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక, భారత విషయానికి వస్తే... ఆసియా గేమ్స్‌లో పతకాల సంఖ్య 25కు చేరింది. ప్రస్తుతం భారత ఖాతాలో 6 స్వర్ణ, 5 రజత, 14 కాంస్య పతకాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications