న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యభిచారం వైపు మొగ్గు చూపారని ప్లేయర్లను ఇంటికి పంపేసిన జపాన్

Japan send home four basketball players from Asian Games amid prostitution scandal

జకార్తా: వ్యభిచారిణులతో కార్యకలాపాలు సాగిస్తున్నారని తమ దేశపు బాస్కెట్‌బాల్ ప్లేయర్లు నలుగురిని ఇంటికి పంపేసింది జపాన్ క్రీడా ప్రభుత్వం. జపాన్‌కు చెందిన తకుయా హషీమోటో, కీటా ఇమామురా, యువ నాగయోషి, తకుమా సాటోలు బాస్కెట్‌బాల్ జట్టులో సభ్యులు. గురువారం ఖతర్ బృందంతో తలపడిన వీరు 82-71 స్కోరుతో విజయం సాధించారు. ఈ ఘటనపై జపాన్ మేనేజ్‌మెంట్ యసుహీరో యమసిత మాట్లాడుతూ.. 'వారు నలుగురు హోటల్ గదిలో వ్యభిచారిణులతో శృంగారం జరిపినట్లుగా తెలిసింది' దీంతో వారిని మున్ముందు రౌండ్లకు పంపకూడదని నిర్ణయించుకున్నామని అన్నారు.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

ఈ క్రమంలోనే వారిని జపాన్‌కు పంపేయాలని బాస్కెట్‌బాల్ అసోసియేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. 'ఈ విషయం తెలియగానే నేను సిగ్గుపడ్డాను. ఇప్పటి నుంచి ఆటగాళ్లపై మరింత శ్రద్ధ పెడతాను. జపనీస్ ఒలింపిక్ కమిటీ ఇక్కడికే వచ్చే ముందే నిబంధనలను మా ముందుంచింది. మేం వాటిని సరిగా పాటించకపోతే జపాన్ వాసులను అవమానించినట్లే అవుతుంది. అందుకే వాటిపై శ్రద్ధ పెడతాం' అని పేర్కొన్నారు. జపాన్ బీ లీగ్‌కు చెందిన నలుగురు ప్లేయర్లు జపాన్‌కు చెందిన వార్తా పత్రికకు సంబంధించిన రిపోర్టర్‌కు దొరికిపోయారు.

ఈ విషయంపై ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా చీఫ్ షేక్ అహ్మద్ అల్ ఫహద్ అల్ సబహ్ మాట్లాడారు. అథ్లెట్లు అంటే రోల్ మోడల్స్‌లా ఉండాలి. ఇలాంటి విషయాలు క్రీడల్లో జరిగాయని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అథ్లెట్లు అంటే ఓ మంచి గుర్తింపు ఉండాలి. సమాజంలో మంచికి వాళ్లు నిదర్శనంగా కనిపించాలి. ఎందుకంటే వాళ్లని అనుసరించే వాళ్లు చాలా మందే ఉంటారు. అంతా అయిపోయాక పతకాలు సాధించింది ఎవరు అని చూడరు. ప్రవర్తనని చూస్తారు.' అని అన్నారు.

ఇలా క్రమశిక్షణా రాహిత్యంగా ఆసియా గేమ్స్‌లో జరగడం ఇది మొదటిసారేం కాదు. కిందటిసారి జరిగిన ఆసియా గేమ్స్‌లో ఓ ఇరానియన్ ఓ మహిళా వాలంటీర్‌ను దారుణంగా తిట్టి నోరు పారేసుకున్నాడు. ఇంకో పాలస్తీనియన్ ఫుట్‌బాలర్ కూడా ఓ మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంకా ఇదే ఏడాది గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ పోటీల్లో మారిటియస్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఓ మహిళా అథ్లెట్ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

Story first published: Saturday, August 25, 2018, 15:47 [IST]
Other articles published on Aug 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X