For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎమర్జెన్సీ: ఒకటి కాదు..అనేక నగరాల్లో నెలరోజుల పాటు అమలు: ఉలికిపాటు

Japan applies the declaration of a state of emergency to Tokyo and other cities to curb Covid19

టోక్యో: ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న ఒలింపిక్స్ 2021లో ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో వేర్వేరు దేశాలకు చెందిన అథ్లెట్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఒలింపిక్స్‌ నుంచి తప్పుకొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి నిర్వాహకులు.. ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ- టోక్యో సిటీలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది.. కలకలం రేపుతోంది. ఎప్పుడూ లేనంతగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి.

 వరుసగా మూడో రోజు రికార్డ్ స్థాయిలో

వరుసగా మూడో రోజు రికార్డ్ స్థాయిలో

టోక్యో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు విడుదల చేసిన రోజువారీ బులెటిన్లు ఆందోళనను కలిగిస్తోన్నాయి. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. ఒలింపిక్స్ ఆరంభమైన తరువాతే కేసుల సంఖ్య పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ఆల్‌టైమ్ హై. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ఈ ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కాలేదు. ఒలింపిక్స్ ఆరంభమైన వారం రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు పుట్టుకుని రావడం టోక్యో అధికార యంత్రాంగాన్ని ఉలికిపడేలా చేస్తోంది.

 అత్యవసర పరిస్థితులు

అత్యవసర పరిస్థితులు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను నివారించడానికి జపాన్ ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ఒలింపిక్స్‌కు వేదికగా మారిన రాజధాని టోక్యో సహా పలు నగరాల్లో అత్యయిక పరిస్థితి విధించింది. ఆగస్టు 31వ తేదీ వరకు ఈ అత్యయిక పరిస్థితులను కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి యోషిహిడె సుగా ఓ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతోన్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఎమర్జెన్సీ విధించిన నగరాలివే..

ఎమర్జెన్సీ విధించిన నగరాలివే..

మొత్తం ఆరు నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది జపాన్ ప్రభుత్వం. దానితోపాటు మరి కొన్ని నగరాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల కింద ఆంక్షలను ప్రకటించింది. రాజధాని టోక్యో, సైటమ, చీబా, కనగవ, ఒసాకా, ఒకినావాల్లో ఎమర్జెన్సీ విధించింది. హొక్కాయిడో, ఇషికావా, క్యోటో, హైగో, ఫుకువోకాల్లో ఆంక్షలను అమలు చేసినట్లు తెలిపింది. అత్యవసర పరిస్థితులు, ఆంక్షలు.. నెలరోజుల పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఆగస్టు 31వ తేదీ తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సడలించడమో లేదా పెంచడమో చేస్తామని పేర్కొంది.

అత్యవసరమైతే తప్ప..

అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దని ప్రభుత్వం సూచించింది. తప్పనసరిగా బయటికి వెళ్లదలిచిన వారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తోన్నామని, యువకులకు టీకాలను వేయడానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆగస్టు చివరి వారం నాటికి దేశ జనాభాలో 40 మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రయాణాలు సాగించే వారు కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, స్వస్థలానికి సురక్షితంగా చేరుకోవాలని సూచించింది.

Story first published: Saturday, July 31, 2021, 15:50 [IST]
Other articles published on Jul 31, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+