పవన్ కళ్యాణ్‌ను కలిసిన కామన్వెల్త్ స్వర్ణ విజేత వెంకట్ రాహుల్

హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తెలుగు తేజం వెంకట్ రాహుల్ రాగాల శనివారం జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో వెంకట్ రాహుల్ స్వర్ణం నెగ్గిన వెంటనే పవన్ కళ్యాణ్ రూ.10 లక్షల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాహుల్‌ను, క్రీడల వైపు ప్రోత్సహించిన అతని తండ్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం అందరికి తెలిసేలా బాపట్ల పట్టణంలో జనసేన తరపున ఈనెల 30న భారీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ వేదికపైనే రాహుల్ తండ్రిని మధును సైతం సన్మానిస్తామని పవన్ పేర్కొన్నారు.
గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామెన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్ట్‌పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151+క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి స్వర్ణ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications