For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాను తేలికగా తీసుకోం: పాంటింగ్

By Pratap
Ricky Ponting
ముంబై: భారత క్రికెట్ జట్టును తాము తేలికగా తీసుకోవడం లేదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. భారత్ తో ఏడు వన్డేల సరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. భారత జట్టును తాము తక్కువగా అంచనా వేయడం లేదని, ఏడు వన్డేల సిరీస్ క్రీడాభిమానులను అలరిస్తుందని, తమకు కష్టమైన వ్యవహారంగానే ఉంటుందని ఆయన అన్నారు. భారత్ మంచి, బలమైన జట్టు అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమది ప్రపంచంలోనే నెంబర్ వన్ జట్టు అని, భారత్ తో గట్టి పోటీ ఉంటుందని ఆనయ అన్నారు.

భారత్ లో భారత్ పై ఆడడాన్ని తాము ఎప్పుడూ ఆనందించామని, గత కొన్నేళ్లుగా తమ ప్రత్యర్థులు పెరుగుతున్నారని, ఇది ప్రపంచ క్రీడకు మంచిదని ఆయన అన్నారు. ఇంగ్లాండుతో మొదలు పెట్టి చాంపియన్స్ ట్రోఫీ వరకు తాము కొన్ని వన్డేల్లో తాము బాగా ఆడామని ఆయన అన్నారు. తాము ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టెస్టుల్లో కన్నా వన్డేల్లో తన రికార్డు బాగుందని ఆయన చెప్పుకున్నారు. కొద్ది నెలలుగా తాను తన కెరీర్ లో అత్యుత్తమ వన్డే ప్రదర్శన చూపానని ఆయన అన్నారు. ముడో స్థానంలో వచ్చే బ్యాట్స్ మన్ గా తనపై ఎంతో బాధ్యత ఉందని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+