ఫిఫా కప్: యుకె క్వీన్ కిస్ కోరిన ఇటలీ ఆటగాడు
రెసిఫె (బ్రెజిల్): ఫిఫా ప్రపంచ కప్ 2014లో నాకౌట్స్‌కు ఇంగ్లాండు అర్హత సాధించడం ఇటలీపై ఆధారపడి ఉంది. శుక్రవారం రాత్రి కోస్టా రికాతో ఇటలీ ఆడే మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఇంగ్లాండు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇటలీ గెలిస్తే ఇంగ్లాండు నాకౌట్స్‌కు అర్హత సాధిస్తుంది.
తాము గెలిచి, ఇంగ్లాండు నాకౌట్స్‌కు అర్హత సాధిస్తే యునైటెడ్ కింగ్‌డమ్ రాణి తనకు ముద్దు ఇవ్వాలని ఇటలీ ఆటగాడు మారియో బాలోటెల్లీ డిమాండ్ చేస్తున్నాడు. ఉరుగ్వేపై ఇంగ్లాండు 2-1 స్కోరుతో గత రాత్రి మ్యాచులో ఓటమి పాలైంది.

ఆ ఓటమితో ఇంగ్లాండు కప్ నుంచి వైదొలిగే దశలో ఉంది. అయితే, ఇటలీ ఈ రాత్రి జరిగే మ్యాచులో కోస్టా రికాపై విజయం సాధిస్తే ఇంగ్లాండు దశ తిరుగుతుంది.
ఈ స్థితిలో ఇటీల ఆటగాడు బాలటెలీ ఆ విధమైన ప్రతిపాదన చేశాడు. తాము కోస్టా రికాను ఓడిస్తే తనకు యుకె రాణి నుంచి తన చెంపపై ముద్దుకావాలని అతను అన్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications