Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా ఓపెనర్‌ సైమన్‌ కాటిచ్‌కు ఉద్వాసన, ఆ గొడవే కారణమా?

Simon Katich
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తాజాగా ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాలో ఓపెనర్‌ సైమన్‌ కాటిచ్‌ పేరు లేకపోవడంతో పెద్ద దుమారమే రేగుతోంది. సెలక్టర్ల నిర్ణయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజాలు తప్పుపడుతున్నారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ మాత్రం సమర్దించుకుంటుంది. అంతేకాకుండా 2011-2012 సీజన్‌లో దేశంలో ఉన్నటువంటి యంగ్ క్రికెటర్స్‌ని యంకరేజ్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని నేషనల్ సెలక్షన్ ప్యానల్ స్పష్టం చేసింది. మరోవైపు మాజీ ఓపెనర్‌ మైకేల్‌ స్లేటర్‌.. కాటిచ్‌ ఉద్వాసన వెనుక ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. రెండేళ్ల క్రితం జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొనే కాటిచ్‌ను జట్టుకు క్లార్క్‌ దూరం చేశాడన్నాడు.

2009లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో విజయానంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్లార్క్‌, కాటిచ్‌ల మధ్య గొడవ జరిగింది. తన స్నేహితురాలు లారా బింగిల్‌తో బయటికి వెళ్లాల్సి ఉన్నందున జాతీయ గీతం త్వరగా పాడాలని క్లార్క్‌ పట్టుబట్టాడు. దీనికికాటిచ్‌ అభ్యంతరం చెప్పాడు. దీంతో కాటిచ్‌ మెడను క్లార్క్‌ తన చేతులతో బిగించాడు. అతికష్టం మీద వీరిద్దరిని జట్టు సహచరులు విడదీయాల్సి వచ్చింది. ఆ గొడవను మనసులో పెట్టుకున్న క్లార్క్‌.. ఇప్పుడు కాటిచ్‌పై పగ తీర్చుకున్నాడని స్లేటర్‌ చెబుతున్నాడు. అంతేకాకుండా గత నాలుగు టెస్టు మ్యాచ్‌లను గనుక మీరు చూసినట్లైతే నేను గాయలతో కూడా ఆడడం జరిగింది. వీటిల్లో రెండు టెస్టు మ్యాచ్‌లను నా బోటనవ్రేలు పగిలిపోయినప్పటికీ కూడా ఆడానన్నారు. ఇదంతా నా దేశం కోసం చేశాను.

సెలక్టర్లు ఒక్క కాటిచ్‌నే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని వార్న్‌ అన్నాడు. 30 ఏళ్లపైబడిన వారందరిపైనా వేటువేస్తే సమజసంగా ఉండేదంటూ పరోక్షంగా కాంట్రాక్టు జాబితాలో ఉన్న పాంటింగ్‌, మైకెల్‌ హసిల ఎంపికను వార్న్‌ ప్రశ్నించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+