ఇంగ్లాండ్ సిరిస్ ఓటమికి కారణాలు ఇవేనా..!!

అక్కడి నుంచి మొదలైన టీమిండియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ చెత్తగా ఆడింది. కీలక బౌలర్ జహీర్ ఖాన్ కనీసం 20 ఓవర్లు కూడా వేయకుండానే గాయంతో తప్పుకోవడంతో భారత్ కష్టాలు ప్రారంభ మయ్యాయి. అదే మ్యాచ్‌లో ఓపెనర్ గంభీర్ గాయం పాలయ్యాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ను జ్వరం వెంటాడింది. ఈ పరిణామాలతో టీమిండియా చారిత్రక మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమి భారత్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇక, టీమిండియా మళ్లిd కోలుకోలేక పోయింది. తర్వాత జరిగిన మూడు మ్యాచుల్లోనూ జట్టుకు అవమానమే మిగిలింది. ఒకవైపు ఇంగ్లండ్ రెట్టించిన ఉత్సాహంతో సిరీస్‌లో చెలరేగి పోగా, టీమిండియా ఏ మ్యాచ్‌కా మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ వచ్చింది. చివరికి భారత్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఘోర పరాజయాల్లో ఒకటిని తన పేరిట లిఖించుకొంది.
ఎన్నో కారణాలు..
ఈ సిరీస్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణం సీనియర్ల వైఫల్యం. సిరీస్‌లో ప్రకంపనలు సృష్టిస్తాడని భావించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఘోరంగా విఫలమయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో జట్టుకు ప్రాతినిథ్యం వహించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేలవమైన బ్యాటింగ్‌తో జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ ఫిట్‌నెస్ లేమితో తొలి టెస్టులోనే చేతులెత్తేశాడు. మరో కీలక బౌలర్ హర్భజన్ సింగ్ తన స్థాయికి తగ్గ బౌలింగ్ కనబరచడంలో విఫలమయ్యాడు. ఇది కూడా వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు.
మెరవని మాస్టర్..
మరోవైపు సిరీస్‌లో ప్రకంపనలు సృష్టిస్తాడని ఊహించిన మాస్టర్ బ్యాట్స్‌మన్ ఘోర వైఫల్యాన్ని చవి చూశాడు. ఒక్క చివరి టెస్టులో తప్ప సచిన్ జట్టుకు అండగా నిలిచింది లేదు. లార్డ్స్‌లో రికార్డు సెంచరీతో అదరగొట్టడం ఖాయమని భావించిన అభిమానులకు సచిన్ నిరాశే మిగిల్చాడు. చివరి మ్యాచ్‌లో తప్ప సచిన్ మెరుగ్గా ఆడలేదు. సెంచరీలతో చెలరేగి పోవడం ఖాయమని భావిస్తే రెండు మ్యాచుల్లో కనీసం అర్ధ సెంచరీలు కూడా నమోదు చేయలేక పోయాడు. అంతేగాక క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకోలేడనే విమర్శను మరోసారి సాకారం చేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలవాల్సిన మాస్టర్ చెత్త బ్యాటింగ్‌తో వికెట్‌ను సమర్పించుకున్నాడు. దీన్ని బట్టి సిరీస్‌లో సచిన్ బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో ఊహించుకోవచ్చు. సురేశ్ రైనా అయితే మరి చెత్త బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఒక్క తొలి టెస్టులో తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ రైనా ఘోర వైఫల్యం చవిచూశాడు. ఏ మ్యాచ్‌లోనూ అతను జట్టుకు అండగా నిలువలేదు. అయినా అతన్ని అన్ని మ్యాచుల్లో ఎందుకు ఆడించారో అంతుబట్టకుండా మారింది.
లక్ష్మణ్ వైఫల్యం...
సిరీస్‌లో మెరుపులు మెరిపిస్తాడని భావించిన హైదరాబాదీ స్టయిలీష్ బ్యాట్స్‌మన్ వివిఎస్. లక్ష్మణ్ ఘోర వైఫల్యం చవి చూశాడు. వైస్ కెప్టెన్‌గా జట్టుకు అండగా నిలువాల్సిన లక్ష్మణ్ ఒక్క మ్యాచ్‌లోనూ శతకాన్ని అందుకోలేక పోయాడు. సిరీస్ ప్రారంభానికి ముందు గొప్పలకు పోయిన లక్ష్మణ్ మైదానంలోకి దిగిన తర్వాత తేలి పోయాడు. తొలి టెస్టులో తప్ప అతను జట్టుకు అండగా నిలిచింది లేదు. సహచరుడు రాహుల్ ద్రవిడ్ మెరుగైన ఆటతో సెంచరీల మీద సెంచరీలు కొట్టిన లక్ష్మణ్ మాత్రం చెత్త బ్యాటింగ్‌తో నిరాశే మిగిల్చాడు. అతని వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గతంలో విదేశీ పిచ్‌లపై భారత్‌కు అండగా నిలిచిన హైదరాబాదీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం చేతులెత్తేశాడు. ఇది జట్టుకు ప్రతికూలంగా మారింది.
పని చేయని 'మహి'మ...
ఇక, సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా వెలుగొందుతున్న భారత సారథి ధోనీకి ఈ సిరీస్ పీడకలనే మిగిల్చిందని చెప్పాలి. సారథ్యం చేపట్టిన తర్వాత పట్టిందల్లా బంగారమే అనే విధంగా సాగిన ధోనీ మహిమ ఇంగ్లండ్ సిరీస్‌లో ఎదురు తిరిగింది. ఈ సిరీస్‌లో అతనికి ఏదీ కలిసి రాలేదు. తొలి టెస్టులో మొదలైన కష్టాలు చివరి టెస్టు వరకు కొనసాగాయి. ఇటు సారథిగా, అటు బ్యాట్స్‌మన్‌గా జట్టును ఆదుకోవడంలో ధోనీ విఫలమయ్యాడు. ఏ మ్యాచ్‌లోనూ అతను ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. ప్రత్యర్థులు మాత్రం ఈ ఓటమితో ధోనీ పని అయిపోయిందని, ఇకపై అతనికి అన్ని కష్టాలేనని ప్రచారం మొదలు పెట్టారు.
బౌలర్లదీ అదే తీరు...
సిరీస్‌లో బౌలర్లు కూడా ఆశించిన విధంగా రాణించలేక పోయారు. జహీర్ ఖాన్ వైదొలగడం బౌలర్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. ప్రవీణ్ కుమార్ మెరుగ్గానే బౌలింగ్ చేసిన ఇషాంత్, శ్రీశాంత్ వైఫల్యం చెందారు. కీలక బౌలర్ హర్భజన్ కూడా తన స్థాయికి తగ్గ బౌలింగ్‌ను కనబరచ లేక పోయాడు. చివరి టెస్టులో జట్టులోకి వచ్చిన ఆర్పీ సింగ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. మొత్తం మీద బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలు భారత్‌ను ఘోర పరాజయాన్ని తెచ్చి పెట్టాయని చెప్పక తప్పదు.
వెంటాడిన ఓపెనింగ్ సమస్య...
సిరీస్‌లో భారత్ వెంటాడిన సమస్యల్లో ఓపెనింగ్ వైఫల్యం ఒకటి. సెహ్వాగ్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడంతో అభినవ్ ముకుంద్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. గంభీర్ కూడా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రమే ఓపెనర్‌గా వచ్చాడు. తర్వాత గాయం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అంతేగాక రెండో టెస్టులో అసలు బరిలోనే దిగలేదు. మరోవైపు ద్రవిడ్ ఓపెనర్‌గా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచగా అభినవ్ ముకుంద్ ఘోరంగా విఫలమయ్యాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో తప్ప అతను మెరుగ్గా ఆడలేక పోయాడు. సెహ్వాగ్, గంభీర్‌లు కూడా ఓపెనర్లుగా ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ల వైఫల్యంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. దీని ప్రభావం తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌పై పడింది. దీంతో వారు తమ స్థాయికి ఆటను కనబరచ లేక పోయారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications