ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్: జీతూరాయ్‌కి స్వర్ణం, అమన్‌ప్రీత్‌కు సిల్వర్
న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్(ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ జీతూరాయ్ స్వర్ణం సాధించి సంచలనం సృష్టించాడు. ఢిల్లీలోని కర్ని సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ పోట్లీ భాగంగా 50మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో జీతూ స్వర్ణం సాధించాడు.
కాగా, మరో భారత షూటర్ అమన్‌ప్రీత్ సింగ్‌కు రజతం దక్కింది. జీతూ 230.1 పాయింట్లు స్కోర్ చేయగా, అమన్‌ప్రీత్ 226.9 పాయింట్లు సాధించారు. ఇరాన్‌కు చెందిన వహిద్ గోల్కందన్ 208.0 పాయిట్లతో కాంస్యం దక్కించుకున్నారు.

ఈ ప్రపంచకప్‌లో 10మీటర్ల మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లోనూ జీతూరాయ్ జోడీ స్వర్ణం సంపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఇది సన్నాహకంగా జరిగింది కాబట్టి పతకాలు అందించలేదు. అలాగే 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో జీతూ కాంస్య పతకం గెలుచుకున్నారు.
స్వర్ణం సాధించిన అనంతరం జీతూరాయ్ మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఇక్కడ ఉండటానికి కారణమైన సైన్యానికి తన పతకాన్ని అంకితమిస్తున్నట్లు జీతూరాయ్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications