Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISSF World Cup: 10మీ ఎయిర్‌రైఫిల్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన చండేలా

ISSF World Cup: Apurvi Chandela breaks world record, wins gold

హైదరాబాద్: న్యూఢిల్లీ వేదికగా శనివారం మొదలైన అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్)‌ వరల్డ్‌కప్‌ 2019లో భారత షూటర్‌ అపూర్వి చండేలా చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచి భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. 26 ఏళ్ల అపూర్వి ఫైనల్లో 252.9 పాయింట్లు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్‌ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ టోర్నీలో రుజు జావో 251.8 పాయింట్లు స్కోరు చేసి రజతాన్ని కైవసం చేసుకోగా.. చైనాకు చెందిన హాంగ్‌ జు 230.4 పాయింట్లతో కాంస్య పతకం కైవసం చేసుకుంది. మొత్తం 101 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అపూర్వి 629.3 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఆరంభం నుంచి ఆధిపత్యం

ఆరంభం నుంచి ఆధిపత్యం

మొత్తం ఎనిమిది మంది తలపడిన తుది సమరంలో ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. సమీప ప్రత్యర్థిపై 1.1 పాయింట్ల ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె వరుసగా 10.6, 10.8, 10.6, 10.8 పాయింట్లు సాధించి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వి కొట్టిన ప్రతీ షాట్‌ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం.

ఇది మూడో వ్యక్తిగత పతకం

ఇది మూడో వ్యక్తిగత పతకం

నిబంధనల ప్రకారం తొలి 12 షాట్‌లు పూర్తయ్యాక ఎనిమిది మందిలో తక్కువ స్కోరు ఉన్న షూటర్‌ నిష్క్రమిస్తారు. ఆ తర్వాత ప్రతి రెండు షాట్‌లకు తక్కువ స్కోరుతో ఉన్న షూటర్‌ పతకం రేసు నుంచి వెనుదిరిగారు. వరల్డ్‌కప్‌లో అపూర్వికి ఇది మూడో వ్యక్తిగత పతకం. 2015లో కాంస్యం నెగ్గిన ఆమె.. అదే ఏడాది జరిగిన మరో వరల్డ్‌కప్‌లో రజతం సాధించింది.

కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన అపూర్వి

కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన అపూర్వి

కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన అపూర్వి.. గతేడాది ఆసియాకప్‌లో స్వర్ణంతో మెరిసింది. 60 దేశాల నుంచి మొత్తం 500 మంది అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ అయినప్పటికీ గతేడాదే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో భారత్‌ గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖాయం చేసుకోవడంతో అపూర్వి తాజా ప్రదర్శనకు ఒలింపిక్‌ బెర్త్‌ దక్కలేదు.

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం

"నా పతకాన్ని పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు అంకితం ఇస్తున్నా. గతేడాది నుంచి స్థిరంగా రాణిస్తున్నా. మున్ముందు కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నా. ఈ ప్రదర్శనతో సంతృప్తి చెందట్లేదు. ఇంకా మెరుగైన స్కోరు కోసం ప్రయత్నిస్తా. ఎప్పటికప్పుడు నాకు నేనే స్ఫూర్తినిచ్చుకుంటా" అని చండేలా చెప్పింది.

Story first published: Sunday, February 24, 2019, 10:44 [IST]
Other articles published on Feb 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+