ప్రపంచ షూటింగ్: బంగారు పతకాన్ని సాధించిన భారత షూటర్
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్(ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్)లో
భారత యువ షూటర్ అంకుర్ మిట్టల్ తన కెరీర్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించాడు. మెక్సికోలోని అకాపుల్కోలో ఐఎస్‌ఎస్‌ఎఫ్ పోటీలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ విభాగంలో అంకుర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మెక్సికోలో జరిగిన పోటీల్లో అతను మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, విలెట్ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకున్నాడు.

ఫైనల్లో మొత్తం 80 పాయింట్లకుగాను అంకుర్ 75 పాయింట్లు సాధించాడు. అంతకు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో 150 పాయింట్లకు 138పాయింట్లతో అంకుర్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా, న్యూఢిల్లీలో జరిగిన గత ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లోనూ వెండి పతకాన్ని సాధించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications