For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISSF World Cup: భారత్‌కు మరో స్వర్ణం అందించిన అభిషేక్‌ వర్మ

ISSF World Cup: Abhishek Verma wins gold, bronze for Saurabh Chaudhary in 10m Air Pistol in Rio

హైదరాబాద్: బ్రెజిల్‌లోని రియో డి జనీరో వేదికగా ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌(ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత్‌ మూడు పతకాలు సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ స్వర్ణం సాధించగా... ఇదే విభాగంలో మరో షూటర్ సౌరభ్‌ చౌదరీకి కాంస్యం గెలిచాడు.

పురుషుల విభాగంలో ఎనిమిది మంది తుది పోరుకు అర్హత సాధించిన అభిషేక్‌ వర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఫైనల్లో 244.2 పాయింట్లతో అభిషేక్‌ స్వర్ణం పతకం నెగ్గాడు. దీంతో 2020లో టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మరోవైపు ఇదే విభాగంలో ఫైనల్‌కు చేరిన సౌరభ్‌ చౌదరీ 221.9 పాయింట్లతో కాంస్యం సాధించాడు.

టర్కీకి చెందిన ఇస్మాయిల్‌ కీల్స్‌ 243.1 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో సంజీవ్‌ రాజ్‌పుత్‌ రజత పతకాన్ని సాధించాడు. అంతకముందు బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ ఇలవేణి స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

ఈ టోర్నమెంట్‌లో మొత్తంగా రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో భారత్‌ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఇప్పటికే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 8 బెర్తులను ఖాయం చేశారు.

Story first published: Friday, August 30, 2019, 13:37 [IST]
Other articles published on Aug 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+