న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISSF World Cup: స్వర్ణం నెగ్గిన షూటర్‌ అభిషేక్‌ వర్మ

ISSF World Cup: Abhishek Verma shoots gold, seals Olympic quota

హైదరాబాద్: బీజింగ్ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. టోర్నీలో భాగంగా శుక్రవారం భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్ట్‌ల్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తాజా పతకంతో అభిషేక్‌ వర్మ టోక్యో వేదకగా 2020లో జరగనున్న ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత షూటర్‌గా నిలిచాడు. మరోవైపు వరల్డ్‌కప్ బరిలోకి దిగడం అభిషేక్‌కు ఇది రెండో సారి కావడం విశేషం. 29 ఏళ్ల అభిషేక్ ఎయిర్‌ పిస్టోల్‌ ఫైనల్స్‌లో 242.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

240.4 పాయింట్లతో రష్యాకు చెందిన షూటర్‌ ఆర్టెమ్‌ చెర్నోసోవ్‌ రెండో స్థానంలో నిలిచి రజతం... కొరియాకు చెందిన సేనుగో హన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుుకన్నాడు. మరోవైపు స్వర్ణం సాధించిన సౌరవ్ జౌధఱి కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, April 27, 2019, 14:01 [IST]
Other articles published on Apr 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X