న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISSF Shooting World Cup: ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించిన సౌరభ్ చౌదరి

Saurabh Chaudhary

హైదరాబాద్: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. శనివారం ఆరంభమైన షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో భారత మహిళా షూటర్‌ అపూర్వి చండేలా సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించగా, ఆదివారం భారత యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరి స్వర్ణం సాధించాడు.

ISSF World Cup: 10మీ ఎయిర్‌రైఫిల్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన చండేలాISSF World Cup: 10మీ ఎయిర్‌రైఫిల్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన చండేలా

పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 16 ఏళ్ల సౌరభ్‌ చౌదరి స్వర్ణం సాధించాడు. గతేడాది జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన సౌరభ్ చౌదరి ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో సెర్బియాకు చెందిన దమిర్ మైకెక్‌ను ఓడించి.. 245 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

తాజా స్వర్ణంతో 2020లో టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో బెర్తుని కూడా దక్కించుకున్నాడు. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సౌరభ్‌ కొట్టిన ప్రతీ షాట్‌ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం. శనివారం మొదలైన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌ 2019లో భారత షూటర్‌ అపూర్వి చండేలా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచి భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. 26 ఏళ్ల అపూర్వి ఫైనల్లో 252.9 పాయింట్లు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్‌ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

Story first published: Sunday, February 24, 2019, 18:45 [IST]
Other articles published on Feb 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X