Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ.. అపూర్వీ చండేలాకు స్వర్ణం

ISSF Shooting World Cup: Apurvi Chandela bags 10m air rifle gold in Munich

భారత స్టార్‌ షూటర్‌ అపూర్వి చందేలా మరోసారి సత్తా చాటింది. ప్రపంచకప్‌లో ఈ ఏడాది రెండో స్వర్ణం గెలుచుకుంది. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో అపూర్వి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో అపూర్వీ విజేతగా నిలిచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ పోటీలో ఎనిమిది మంది షూటర్ల పాల్గొనగా.. 24 షాట్‌లతో ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వీ 251 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 250.8 పాయింట్లతో వాంగ్‌ లుయావో (చైనా) రజతం.. 229.4 పాయింట్లతో జు హాంగ్‌ (చైనా) కాంస్య పతకం సాధించారు. మరో భారత అమ్మాయి ఇలవేణి 0.1 పాయింట్లతో కాంస్యం కోల్పోయింది.

చివరి షాట్‌ వరకూ అపూర్వి (240.6 పాయింట్లు), వాంగ్‌ (240.5 పాయింట్లు) మధ్య వ్యత్యాసం కేవలం 0.1 పాయింట్లు మాత్రమే. చివరి షాట్‌లో అపూర్వి 10.4 పాయింట్లు సాధించగా.. వాంగ్‌ 10.3 పాయింట్లు చేసింది. దీంతో అపూర్వీ 0.2 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ అపూర్వీ పసిడి పతకం సాధించింది.

Story first published: Monday, May 27, 2019, 9:48 [IST]
Other articles published on May 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+