ఐరిష్ హీరో ఓబ్రైన్, ఇంగ్లాండుకు షాక్: రికార్డు విజయం

ఓబ్రైన్‌కు.. కుసాక్ (47; 58 బంతుల్లో 3X4, 1X6), మూనీ (33 నాటౌట్; 30 బంతుల్లో 6X4) తోడవడంతో ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్‌లో అతిపెద్ద ఛేదన ఇదే. ఓబ్రైన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు బెంగళూరులో అభిమానులు ఐర్లాండ్ మద్దతుదారులుగా మారిపోయారు. 25 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసిన ఐర్లాండ్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ కెవిన్ ఓబ్రైన్ రాకతో ఇంగ్లాండ్ తలరాతే మారిపోయింది.
ఆ సమయంలో క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఫోర్లు, సిక్స్‌లతో రెచ్చిపోయాడు ఓబ్రైన్. 31వ ఓవర్‌కు ఐర్లాండ్ స్కోరు 167/5. 36వ ఓవర్లో పవర్‌ప్లే ముగిసేసరికి 229/5. వికెట్లేమీ నష్టపోకుండా 62 పరుగులు. 30 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్న ఓబ్రైన్ మరో 20 బంతుల్లో రెండో 50 సాధించాడు. 50 బంతుల్లో సెంచరీతో ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టాడు. తర్వాత కాస్త జోరుతగ్గింది కానీ 49వ ఓవర్ వరకు నిలిచి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. విజయానికి మరో 11 పరుగుల దూరంలో రనౌటై ఓబ్రైన్ నిష్క్రమించాడు. ఓబ్రైన్ ఔటయ్యాక జాన్‌స్టన్ (7 నాటౌట్)తో కలిసి మూనీ (33) లక్ష్యాన్ని పూర్తిచేశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications