ఫోటో దిగుతూ అమ్మాయిని తాకాడు, తెలియదని..
సియోల్: ఇరాన్‌కు చెందిన ఓ సాకర్ అధికారి ఓ మహిళా వాలంటీర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే అనుమానంతో అతనిని పోలీసులు విచారిస్తున్నారు. సాకర్ స్టేడియంలో ఓ మహిళా వాలంటీర్‌ను తాకినట్లుగా ఇరాన్ సాకర్ అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతనిని తాము విచారిస్తున్నామని దక్షిణ కొరియా పోలీసులు తెలిపారు.
ఈ విషయాన్ని సదరు మహిళా వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిని విచారిస్తున్నారు. అతనిని కస్టడీలోకి తీసుకోలేదు. అయితే, దేశం విడిచి వెళ్లవద్దని పోలీసులు ఆదేశించారు.

సోమవారం ఫోటో తీసుకునే సమయంలో సదరు మహిళా వాలంటీర్ పక్కన ఇరాన్ సాకర్ అధికారి నిలుచున్నాడు. తనను తాకాడాని ఆమె ఆరోపిస్తోంది.
దక్షిణ కొరియాలో తాకడం నేరమన్న సంగతి తనకు తెలియదని ఆ 38 ఏళ్ల ఇరాన్ సాకర్ అధికారి వాపోతున్నాడు. దీంతో ఈ కేసును ప్రాసిక్యూటర్స్‌కు పంపాలా? వద్దా? అనే దానిపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, సదరు మహిళా వాలంటీర్ కాలేజీ యువతి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications