
హైదరాబాద్: అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ రష్యాను పోటీ నుంచి నిషేదిస్తూ తుది నిర్ణయం తీసుకుంది. రష్యన్ పారాలింపిక్స్ కమిటీని సోమవారం జరిగిన సమావేశంలో రద్దు చేసింది. దక్షిణాఫ్రికాలో జరగనున్న అంతర్జాతీయ పారాలింపిక్స్ పోటీల్లో పాల్గొనకూడదంటూ నిషేదాజ్ఞలు జారీ చేసింది. రష్యా దేశం ఆటగాళ్లు డోపింగ్ పాల్గొన్నారంటూ వచ్చిన వాదనలకు గాను తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఈ డోపింగ్ కలకలంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మార్చిలో జరుగనున్న పారాలింపిక్స్ వింటర్ గేమ్స్‌లో పాల్గొనకుండా రష్యాపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వ్యక్తిగతంగా ఈ పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు మినహాయింపు ఇచ్చింది.
వీళ్లు తటస్థ పతాకం కింద బరిలోకి దిగేందుకు అనుమతి ఇచ్చింది. డోపింగ్ ఉదంతం బయటకు రావడంతో 2016లోనే రష్యాపై ఐపీసీ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. రష్యా పారాలింపిక్ కమిటీ (ఆర్‌పీసీ)పై సస్పెన్షన్ కొనసాగుతుంది.
కొన్ని కఠినమైన నిబంధనల మేరకు వ్యక్తిగతంగా ఈ పోటీల్లో పాల్గొనాలకునే రష్యన్ అథ్లెట్లకు అవకాశం ఇస్తున్నాం అని సోమవారం అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) నిర్ణయించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.