
హైదరాబాద్: సల్లీ పియర్సన్ వయసు 31. అయితే ఇది కేవలం సంఖ్య మాత్రమే. నిజానికి ఈ వయసులో ఉన్న అథ్లెట్లకు పసిడి సాధించాలనే ఆశ ఎంతమాత్రం ఉండదు. కానీ సల్లీ పియర్సన్ అలా కాదు. ఈ ఏడాది లండన్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం సాధించింది.
ఇక్కడ పియర్సన్ పసిడి గెలవడం కంటే తన కంటే తక్కువ వయసున్న వారికి ఆదర్శంగా నిలిచింది. అంతకముందు 2011లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్స్‌లో కూడా సల్లీ పియర్సన్ పసిడి గెలవడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.