Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'పయోలీ' ఎక్స్‌ప్రెస్ పీటీ ఉషకు అరుదైన గౌరవం

 International Association of Athletics Federations honours Indian legend PT Usha

హైదరాబాద్: మాజీ ఒలంపియన్, భారత మాజీ అథ్లెట్ పీటీ ఉషకు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్(ఐఏఏఎఫ్) ఆమెను ప్రతిష్టాత్మక వెటరన్ పిన్ అవార్డుతో సత్కరించింది. దోహా వేదికగా జరిగిన 52వ ఐఏఏఎఫ్ కాన్ఫరెన్స్‌లో పీటీ ఉష ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పీటీ ఉష తన ట్విట్టర్‌లో "దోహాలో జరిగిన 52వ ఐఏఏఎఫ్ కాన్ఫరెన్స్‌లో నాకు వెటరన్ పిన్ అవార్డుని ప్రదానం చేసినందుకు ఐఏఏఎఫ్ మరియు ప్రెసిడెంట్ సెబాస్టియన్ కోకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన దేశంలో అథ్లెటిక్స్‌ అభివృద్ధికి నా వంతు కృష్టి చేస్తూనే ఉంటాను" అని బుధవారం ట్వీట్ చేశారు.

ట్విట్టర్‌లో ఫోటోలు

ట్వీట్‌తో పాటు ఐఏఏఎఫ్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో నుంచి ఆమె అవార్డు అందుకున్న ఫోటోలను కూడా ట్విట్టర్‌లో జత చేశారు. 'పయోలీ ఎక్స్‌ప్రెస్'గా అభిమానులు పిలుచుకునే పీటీ ఉషను 1983లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో సన్మానించింది. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 1985లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

1986 సియోల్‌లో

1986 సియోల్‌లో

1986 సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో 2 రజిత, 1990 ఆసియాడ్‌లో 3 రజిత, 1994 ఆసియాడ్‌లో ఒక రజిత పతకం సాధించింది. 1984 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతుతో కాంస్య పతకం లభించే అవకాశాన్ని చేజార్చుకుంది.

తొలి భారతీయ మహిళగా

తొలి భారతీయ మహిళగా

తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా పీటీ ఉష చరిత్ర సృష్టించింది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో జన్మించిన పీటీ ఉష 1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి, అందులో చేరింది. 1979లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొంది.

101 స్వర్ణ పతకాలు సాధించిన పీటీ ఉష

101 స్వర్ణ పతకాలు సాధించిన పీటీ ఉష

అప్పుడే ఆమె లోని నైపుణ్యాన్ని కోచ్ ఓ. నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్ గా శిక్షణ ఇచ్చాడు. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. అంతర్జాతీయ క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.

Story first published: Wednesday, September 25, 2019, 17:57 [IST]
Other articles published on Sep 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+