Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: నేటి భారత క్రీడాంశాలు.. బరిలోకి దిగుతున్న తెలుగు అమ్మాయిలు!

పారిస్ ఒలింపిక్స్‌-2024లో బుధవారం పోటీలకు భారత్ సిద్ధమైంది. మనుబాకర్-సరబ్‌జోత్ అందించిన పతక ఉత్సాహంతో ఇవాళ మన క్రీడాకారులు మరింత పట్టుదలతో బరిలోకి దిగుతున్నారు. వాళ్లలో తెలుగు అమ్మాయిలు అయిన స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ కూడా ఉన్నారు.

భారత్ మంగళవారం మెరుగైన ప్రదర్శనే చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మను-సరబ్‌జోత్ కాంస్య పతకం నెగ్గారు. బ్యాడ్మింటన్‌లో స్టార్ జోడీ స్వాతిక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి గ్రూప్ దశ పోరులో విజయం సాధించి గ్రూప్-సీలో అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఐర్లాండ్‌పై మన హాకీ జట్టు ఘన విజయం సాధించింది. మరికొందరు అథ్లెట్లు ఆశించిన మేరకు రాణించలేకపోయారు. కాగా, ఇవాళ షూటింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో మన క్రీడాకారులు రంగంలోకి దిగుతున్నారు.

India s Full Schedule for July 31 at Paris Olympics 2024 Key Events in Shooting and Badminton

జులై 31న భారత షెడ్యూల్
షూటింగ్‌: పురుషుల 50మీ.రైఫిల్‌ 3 పొజిషన్స్‌ క్వాలిఫికేషన్‌ (ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్‌ కుశాలె)- మధ్యాహ్నం 12.30 గంటలకు
షూటింగ్‌: మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్-2 (శ్రేయాసి సింగ్, రాజేశ్వరి కుమారి)- మధ్యాహ్నం 12.30 గంటలకు

బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌ (పీవీ సింధు × క్రిస్టిన్‌)- మధ్యాహ్నం 12.50 గంటలకు,
బ్యాడ్మింటన్‌: పురుషుల సింగిల్స్‌ (లక్ష్యసేన్‌ × జొనాథన్‌)- మధ్యాహ్నం 1.40 గంటలకు,
బ్యాడ్మింటన్‌: పురుషుల సింగిల్స్‌ (ప్రణయ్‌ × ఫాట్‌లీ)- రాత్రి 11 గంటలకు

ఈక్వెస్ట్రియన్‌: వ్యక్తిగత డ్రెసెజ్‌ గ్రాండ్‌ ప్రి (అనూష్‌)- మధ్యాహ్నం 1.30 గంటలకు
టేబుల్‌ టెన్నిస్‌: మహిళల సింగిల్స్‌ (శ్రీజ × జియాన్‌)- మధ్యాహ్నం 2.30 గంటలకు,
షూటింగ్‌: మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్‌ ఫైనల్‌- రాత్రి 7 గంటలకు

బాక్సింగ్‌: మహిళల 75 కేజీల ప్రిక్వార్టర్స్‌ (లవ్లీనా × సునీవా)- మధ్యాహ్నం 3.50 గంటలకు,
బాక్సింగ్‌: పురుషుల 71 కేజీల ప్రిక్వార్టర్స్‌ (నిశాంత్‌ దేవ్‌ × గాబ్రియల్‌)- రాత్రి 12.34
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత విభాగం (దీపిక × రీనా)- మధ్యాహ్నం 3.56 గంటలకు,
ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత విభాగం (తరుణ్‌దీప్‌ × టామ్‌)- రాత్రి 9.28 గంటలకు

Story first published: Wednesday, July 31, 2024, 8:41 [IST]
Other articles published on Jul 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+