పారిస్ ఒలింపిక్స్-2024లో భారత షూటర్ మను బాకర్ మరో కాంస్య పతకానికి చేరువలో నిలిచింది. స్టార్ షూటర్ సరబ్‌జోత్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం కోసం మంగళవారం పోటీపడనుంది. షూటింగ్‌లో పతక పోరుతో పాటు ఇవాళ ట్రాప్ క్వాలిఫికేషన్ గేమ్స్ కూడా ఉన్నాయి.
అంతేగాక ఇవాళ రోయింగ్, ఈక్వెస్ట్రియన్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఆర్చరీలో మన భారత క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. అలాగే మన హాకీ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇక ఆర్చరీలో మన తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర పురుషుల వ్యక్తిగత విభాగంలో పోటీపడనున్నాడు.

జులై 30న భారత షెడ్యూల్
షూటింగ్: ట్రాప్ మహిళల క్వాలిఫికేషన్ (శ్రేయసి, రాజేశ్వరి)- మధ్యాహ్నం 12.30 గంటలకు
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్స్ (బాల్‌రాజ్)- మధ్యాహ్నం 1 గంటలకు
షూటింగ్: ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్)- మధ్యాహ్నం 12.30 గంటలకు,
షూటింగ్: 10మీ.ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పోరు (మను-సరబ్‌జోత్ × లీ-యెజిన్)- మధ్యాహ్నం 1 గంటలకు
ఈక్వెస్ట్రియన్: డ్రెసెజ్ వ్యక్తిగత గ్రాండ్ ప్రి (అనూష్)- మధ్యాహ్నం 2.30 గంటలకు
హాకీ: భారత్ × ఐర్లాండ్- సాయంత్రం 4.45 గంటలకు
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత విభాగం (అంకిత, భజన్)- సాయంత్రం 5.14 గంటలకు
ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత విభాగం (ధీరజ్ × ఆడమ్)- రాత్రి 10.46 గంటలకు
బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్ (సాత్విక్-చిరాగ్ శెట్టి × అల్ఫియాన్-అర్డియాంతో)- సాయంత్రం 5.30 గంటలకు
బ్యాడ్మింటన్: మహిళల డబుల్స్ (అశ్విని-తనీషా × మపాస-యు)- సాయంత్రం 6.20 గంటలకు
షూటింగ్: ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్ ఫైనల్- రాత్రి 7 గంటలకు
బాక్సింగ్: పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్ (అమిత్ × పాట్రిక్)- రాత్రి 7.16 గంటలకు,
బాక్సింగ్: మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32 (జాస్మిన్ × పెటిసియో)- రాత్రి 9.24 గంటలకు,
బాక్సింగ్: మహిళల 54 కేజీల ప్రిక్వార్టర్స్ (ప్రీతి × మార్సెలా)- రాత్రి 1.06 గంటలకు
కాగా, ఇవాళ మరికొన్ని పోటీల్లో పతకాలు పోరులు జరగనున్నాయి. టేబుల్ టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ జరగనుంది. ఈ పోరు సాయంత్రం 6 గంటలకు ఆరంభమవుతుంది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో మహిళల టీమ్ ఫైనల్ రాత్రి 9.45 గంటలకు మొదలవుతుంది. స్విమ్మింగ్‌లో మహిళల 100మీ.బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ రాత్రి 12.26, పురుషుల 800మీ.ఫ్రీస్టైల్ ఫైనల్ రాత్రి 12.32 జరగనుంది.