Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: నేటి భారత క్రీడాంశాలు.. పతకాల వేట కొనసాగేనా?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ఆనవాయితీగా మరోసారి అమ్మాయిలతోనే మన పతకాల వేట మొదలైంది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా షూటర్‌గా ఆమె చరిత్రకెక్కెంది. అయితే సోమవారం భారత్ మరో మూడు పతకాల లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

షూటింగ్‌లో రెండు పతకాలకు మన షూటర్లు సిద్ధమయ్యారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో మహిళల విభాగంలో రమిత, పురుషుల విభాగంలో అర్జున్‌ బబుతా పోటీపడుతున్నారు. ఇక ఆర్చరీ పురుషుల జట్టు విభాగంలో భారత్ పతకంపై కన్నేసింది. ధీరజ్, ప్రవీణ్‌తో కలిసి తెలుగు ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ బరిలోకి దిగుతున్నాడు.

India s Full Schedule for Day 3 at Paris Olympics 2024 Key Events in Shooting and Archery

జులై 29న భారత షెడ్యూల్
బ్యాడ్మింటన్‌: పురుషుల డబుల్స్‌ (సాత్విక్‌-చిరాగ్‌ × మార్క్‌-మెర్విన్‌)- మధ్యాహ్నం 12 గంటలకు
బ్యాడ్మింటన్‌: మహిళల డబుల్స్‌ (అశ్విని-తనీషా × నమి-చిహారు)- మధ్యాహ్నం 12.50 గంటలకు
బ్యాడ్మింటన్‌: పురుషుల సింగిల్స్‌ (లక్ష్యసేన్‌ × జులియన్‌)- సాయంత్రం 5.30 గంటలకు

షూటింగ్‌: 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌ (మను-సరబ్‌జోత్, రిథమ్‌-అర్జున్‌ చీమా)- మధ్యాహ్నం 12.45 గంటలకు,
షూటింగ్‌: పురుషుల ట్రాప్‌ క్వాలిఫికేషన్‌ (పృథ్వీరాజ్‌)- మధ్యాహ్నం 1 గంటకు
హాకీ: భారత్‌ × అర్జెంటీనా- సాయంత్రం 4.15 గంటలకు
టేబుల్‌ టెన్నిస్‌: మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ (శ్రీజ × జియాన్‌)- రాత్రి 11.30 గంటలకు

షూటింగ్‌: 10మీ.ఎయిర్‌ రైఫిల్‌ మహిళల ఫైనల్‌ (రమిత)- మధ్యాహ్నం 1 గంటలకు
షూటింగ్‌: పురుషుల ఫైనల్‌ (అర్జున్‌ బబుతా)- మధ్యాహ్నం 3.30 గంటలకు
ఆర్చరీ: పురుషుల టీమ్‌ క్వార్టర్స్‌ (తరుణ్‌దీప్, ధీరజ్, ప్రవీణ్‌)- సాయంత్రం 6.30 గంటలకు
పతక రౌండ్లు- రాత్రి 8.18 గంటలకు

ఇక ఇవాళ మరికొన్ని పోటీల్లో పతకాలు పోరులు జరగనున్నాయి. డైవింగ్‌, స్కేట్ బోర్డింగ్, ఆర్టిస్టిక్ జిమ్మాస్టిక్స్, స్విమ్మింగ్ పోటీలు ఉన్నాయి. డైవింగ్‌‌లో పురుషుల సింక్రనైజ్డ్‌ 10మీ ప్లాట్‌ఫామ్‌ ఫైనల్‌ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. స్కేట్‌బోర్డింగ్‌లో పురుషుల స్ట్రీట్‌ ఫైనల్‌ రాత్రి 8.30 గంటలకు, ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో పురుషుల టీమ్‌ ఫైనల్‌ రాత్రి 9 గంటలకు జరుగుతుంది. స్విమ్మింగ్‌లో మహిళల 400మీ.వ్యక్తిగత మెడ్లీ ఫైనల్‌, పురుషుల 200మీ.ఫ్రీస్టైల్‌ ఫైనల్‌ అర్ధరాత్రి 12 గంటలకు మొదలవుతాయి.

Story first published: Monday, July 29, 2024, 8:47 [IST]
Other articles published on Jul 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+