కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్: భారత్‌కు 8 స్వర్ణాలు
హైదరాబాద్: కామన్‌వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. సింగపూర్‌లో ఆదివారం ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెజ్లర్లు 8 స్వర్ణాలు, 8 రజతాలు సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ ఐదు బంగారు పతకాలను గెలిచింది.

భారత రెజ్లర్లు హర్‌ఫుల్ (61 కేజీలు), బజరంగ్ (65 కేజీలు), జితేందర్ (74 కేజీలు), దీపక్ (86 కేజీలు), అరుణ్ (86 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఇక గ్రీకో రోమన్ విభాగంలో (59 కేజీలు), దీపక్ (71 కేజీలు) బంగారు పతకాలు సాధించారు. కాగా మొత్తం ఏడు విభాగాల్లో భారత రెజ్లర్ల మధ్య ఫైనల్ పోరు జరిగింది.
61 కేజీల విభాగంలో వికాస్ రజతం సాధించాడు. 125 కేజీల విభాగంలో హితేందర్ బంగారు పతకం దక్కించుకున్నాడు. రాహుల్ మాన్ (65 కేజీలు), సందీప్ (74 కేజీలు), అరుణ్ (86 కేజీలు), కృషన్ (125 కేజీలు) రజత పతకాలు గెలిచారు. కృషన్ (59 కేజీలు), రఫీక్ (71 కేజీలు), సచిన్ (98 కేజీలు) రజత పతకాలను సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications