For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైనల్‌కు చేరిన భారత మహిళల కబడ్డీ జట్టు

Indian Women’s Kabaddi Team Enter Third Successive Final in Asiad

జకార్తా: భారత మహిళల కబడ్డీ జట్టు తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. వరుసగా మూడో సారి ఆసియా క్రీడల ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో చైనీస్‌ తైపీని 27-14 తేడాతో చిత్తుగా ఓడించింది. గత రెండు పర్యాయాల్లో ఆసియా క్రీడల విజేత భారతే కావడం గమనార్హం. 2012, 2013, 2014లో కబడ్డీ ప్రపంచకప్ గెలిచిన మహిళల జట్టుకు ప్రస్తుత క్రీడల్లో ఎదురేలేదు.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ప్రతిష్టాత్మక క్రీడా సంరంభం ఆసియా గేమ్స్‌లో భాగంగా జరుగుతోన్న పోటీలో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరింది. ఇప్పటికే భారత్ 3 సార్లు ఫైనల్ చేరి వరల్డ్ కప్ అందుకుంది. 2012, 2013, 2014లలో విజేతగా నిలిచిన భారత్ ఈ సారి ఫైనల్‌లో ఇరాన్.. థాయ్‌లాండ్‌లలో ఒకరితో పోటీపడనుంది.

పురుషుల కబడ్డీ ఈవెంట్‌లో ఏడు సార్లు స్వర్ణ విజేత అయిన భారత జట్టు గురువారం జరగనున్న సెమీ ఫైనల్స్‌లో ఇరాన్ జట్టుతో పోటీ పడుతుంది.

Story first published: Thursday, August 23, 2018, 17:55 [IST]
Other articles published on Aug 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+