For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రగ్బీలో సంచలనం.. రికార్డు సృష్టించిన భారత మహిళలు!

బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన ఎమిరేట్స్ అండర్-20 ఏషియా రగ్బీ సెవెన్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్-20 మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శనతో కాంస్య(Bronze) పతకాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్‌కు మొదటిసారిగా భారత్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. స్వదేసంలోనే ఈ విజయం సాధించి చరిత్ర సృష్టించారు.

భారత మహిళల జట్టు ప్రయాణం
భారత మహిళల జట్టు పూల్ దశలో అద్భుతమైన ప్రదర్శనతో సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో బలమైన చైనా జట్టుతో తలపడి 7-28 తేడాతో ఓటమి పాలైంది. అయితే కాంంస్య పతకం కోసం ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సత్తా చాటింది. భూమిక మొదటి ట్రైతో 7-0 స్కోరును నమోదు చేయగా.. గురియా కుమారి రెండో ట్రైతో ఆధిక్యాన్ని 12-0కి పెంచింది. ఉజ్బెకిస్థాన్‌ ఒక ట్రై చేసి తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ భారత రక్షణ బలంగా ఉండటంతో 12-5 తేడాతో విజయం సాధించింది.

Indian U20 Women s Rugby Team Creates History with Bronze at Asia Rugby Sevens

ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఎదురైన రెండు ఓటములు కూడా చైనా, హాంకాంగ్ చైనా జట్ల చేతిలోనే.. ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరాయి. ప్రధాన కోచ్ కియానో ఫూరి మార్గదర్శకత్వంలో యువ, అనుభవజ్ఞులైన క్రీడాకారిణులు అద్భుతమైన టీంవర్క్ ప్రదర్శించి కాంస్య పతకం సాధించారు.

గర్వకారణమైన క్షణం
రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్ ఈ విజయంపై మాట్లాడుతూ.. ఇది భారత రగ్బీకి చరిత్రాత్మక క్షణమని అన్నారు. స్వదేశంలో ప్రేక్షకులతో కాంస్య పతకం గెలవడం గొప్ప విజయం అని, ఈ విజయం తర్వాతి తరం క్రీడాకారులకు స్ఫూర్తిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

టోర్నమెంట్ తుది ఫలితాలు
మహిళల ఫైనల్: చైనా vs హాంకాంగ్ చైనా, 29-21 తేడాతో చైనా విజేతగా నిలిచింది.

మహిళల కాంస్యం: ఇండియా vs ఉజ్బెకిస్తాన్, 12-5 తేడాతో భారత్ విజయం సాధించింది.

పురుషుల ఫైనల్: హాంకాంగ్ చైనా vs శ్రీలంక, 33-0 తేడాతో హాంకాంగ్ చైనా విజేతగా నిలిచింది.

పురుషుల కాంస్యం: మలేషియా vs చైనా, 19-7 తేడాతో మలేషియా విజయం సాధించింది.

Story first published: Monday, August 11, 2025, 9:31 [IST]
Other articles published on Aug 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+