క్యూ కట్టిన భారత బ్యాట్స్ మెన్: 148 పరుగులు
వడదొర: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డే క్రికెట్ మ్యాచులో గురువారం భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ జాన్సన్ ధాటికి భారత బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ దారి పట్టారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యారు. గంగూలీ రన్నవుట్ అయ్యాడు. కెప్టెన్ ధోనీ కూడా నాలుగు పరుగులకే వికెట్ ను కోల్పోయాడు. భారత్ 50 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయింది. చివర్లో తొమ్మిదో వికెట్ కు జహీర్ ఖాన్ చేసిన పరుగులే అత్యంత విలువైనవిగా మిగిలాయి. భారత్ 39.4 ఓవర్లలో 148 పరుగులు చేసింది. జహీర్ ఖాన్ 28 పరుగులు చేశాడు. అతనికి అర్పీ సింగ్ చక్కని సహకారం అందించాడు.
తన 400 వన్డే ఆడుతున్న సచిన్ టెండూల్కర్ 47 పరుగులు చేసి అవుటయ్యాడు. భారత్ ఒకానొక సందర్భంలో 43 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. 107 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. నాలుగో వన్డేలో అదరగొట్టిన రాబిన్ ఊతప్ప 5 పరుగులు, ధోనీ 4 పరుగులు, యువరాజ్ 1 పరుగు చేశారు. ఇర్పాన్ పఠాన్ 26 పరుగులు చేశాడు. పఠాన్, సచిన్ జోడీ 41 పరుగులు జోడించగా, జహీర్ ఖాన్, ఆర్పీ సింగ్ ల జోడీ 41 పరుగులు జోడించింది. జాన్సన్ 26 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. బ్రెట్ లీకి రెండు వికెట్లు వచ్చాయి.
Story first published: Thursday, October 11, 2007, 23:53 [IST]
Other articles published on Oct 11, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications