For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hima Das: స్ప్రింటర్ హిమదాస్​కు కరోనా!!

Indian Sprinter Hima Das Tests Positive For Corona Virus

ముంబై: భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్​కు బుధవారం కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. పాటియాలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎస్‌)లో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హిమదాస్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నానని, ఆరోగ్య పరిస్థితిగా బాగానే ఉందని ఆమె ట్విటర్ వేదికగా తెలిపారు. తొడ కండరాల గాయం నుంచి హిమదాస్ ఇప్పుడిపుడే కోలుకుంటున్నారు. అంతలోనే ఆమెను కరోనా సోకింది. కొరోనా నుంచి హిమదాస్ త్వరగా కోలుకోవాలి అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

'ఈ రోజు నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఐసోలేషన్​లో ఉన్నా. ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకోవడంతో పాటు ఇంతకు ముందు కంటే బలంగా తిరిగి వచ్చేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి ఎదురు చూస్తున్నాను. దేశ ప్రజలందరూ మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి' అని భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ ట్వీట్ చేశారు. ఆమె త్వరగా కోలుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ పేర్కొంది. ప్రత్యేక వైద్య బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపింది.

హిమాదాస్‌ 2018లో అండర్‌-20 ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో విజయం సాధించారు. దాంతో ఈ ఈవెంట్‌లో ప్రపంచ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా రికార్డుల్లో నిలిచారు. జూలై-ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ 2021కు హిమాదాస్‌ అర్హత సాధించలేకపోయారు. కండరాల ఒత్తిడి కారణంగా ఆమె కొంతకాలం విరామం తీసుకోగా.. ఈ నెల 10న పాటియాలా చేరుకున్నారు. అయితే ఈ నెల 8, 9 తేదీల్లో గౌహతిలో ఉన్న సమయంలోనే ఆమెకు కరోనా సోకిఉండొచ్చని సమాచారం తెలుస్తోంది.

ఈ నెల 8, 9 తేదీల్లో గౌహతిలో ఉన్న సమయంలోనే హిమాదాస్‌ కొద్దిగా అలసిపోయినట్లుగా కనిపించారని ఆమె కోచ్‌ గలీనా బుఖరినా పేర్కొన్నారు. ఆ సమయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని అనుకున్నామని, అయితే పాటియాలాలో కరోనా పరీక్షలు నిర్వహించిన సమయంలో కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని బుఖరినా చెప్పారు. ప్రస్తుతం హిమాదాస్‌ కామన్వెల్త్‌, ఆసియా గేమ్స్‌పై దృష్టి పెట్టారు. అందుకోసం ఎంతో కష్టపడుతున్నారు.

Story first published: Wednesday, October 13, 2021, 16:30 [IST]
Other articles published on Oct 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+