గ్లాస్గో: కామనె్వల్త్ గేమ్స్ షూటింగ్‌లో భారత్ పతకాల వేటను కొనసాగిస్తున్నది. నాలుగో రోజు నాలుగు పతకాలు సాధించింది. మహిళలు, పురుషుల డబుల్ ట్రాప్ విభాగాల్లో వరుసగా రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. మహిళల విభాగంలో శ్రేయాసీ సింగ్ ద్వితీయ, పురుషుల విభాగంలో మహమ్మద్ అసబ్ తృతీయ స్థానాలను కైవసం చేసుకోవడంతో షూటింగ్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల శ్రేయాసీ ఫైనల్స్‌లో 76 పాయింట్లతో రాణించింది.
భారత జాతీయ రైఫిల్ సంఘం మాజీ అధ్యక్షుడు, దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె శ్రేయాసీ క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో ఐదో స్థానాన్ని ఆక్రమించినప్పటికీ, ఫైనల్స్‌లో అద్భుత ప్రతిభ కనబరింది. ఈ విభాగంలో పోటీపడిన వర్ష వర్మన్‌కు ఐదో స్థానం దక్కింది. ఇంగ్లాండ్ షూటర్ చార్లొట్ కార్వుడ్ 80 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించగా, ఆమె సహచర షూటర్ రాచెల్ పరీష్ కాంస్య పతకాన్ని అందుకుంది.
పురుషుల డబుల్ ట్రాప్‌లో 26 ఏళ్ల అసబ్ మూడో స్థానాన్ని సంపాదించాడు. ఈ క్రమంలో అతను మాల్టా షూటర్ నాథన్ జురెబ్‌ను నాలుగో స్థానానికి నెట్టాడు. క్వాలి ఫికేషన్ రౌండ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన స్టీవెన్ స్కాట్, మా థ్యూ ఫ్రెంచ్‌తో కలిసి అతను 27 పాయంట్లతో సమవుజ్జీగా నిలిచాడు. దీనితో కాంస్య పతకం కోసం ఎవరు పోరాడాల్సి ఉంటుందో నిర్ణయంచేందుకు షూటాఫ్ పోటీ జరిగింది. స్కాట్, ఫ్రెంచ్ ఇద్దరూ రెండేసి లక్ష్యాలను ఛేదించారు. అస బ్ ఒక లక్ష్యాన్ని మాత్రమే కొట్టగలిగాడు. ఫలితంగా నాలుగో స్థానంలో ఉన్న జురెబ్‌తో అతను కాంస్య పతకం కోసం పోరాడాల్సి వచ్చింది. అందులో సఫలమైన అసబ్ భారత్‌కు మరో పతకాన్ని సాధించి పెట్టాడు.

కాంస్యం సాధించిన రజ్వీందర్
మహిళల జూడో +78 కిలోల విభాగంలో రజ్వీందర్ కౌర్ కాంస్య పతకాన్ని సాధించింది. మూడో స్థానానికి జరిగిన ప్లే ఆఫ్ బౌట్‌లో ఆమె కెన్యాకుచెందిన ఈస్తర్ అకిన్యీ రతుగీని ఓడింది. ఈ ఫైట్ ఫలితాన్ని పెనాల్టీ పాయింట్ల ద్వారా నిర్ణయించడం గమనార్హం. 1990 ఆక్లాండ్‌లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన జూడో తిరిగి రెండోసారి 2002 మాంచెస్టర్‌లో అవకాశం దక్కించుకుంది. సమారు 12 సంవత్సరాల తర్వాత ముచ్చటగా మూడోసారి కామనె్వల్త్ గేమ్స్‌లో చోటు సంపాదించిన జూడోలో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకూ నాలుగు పతకాలు సాధించింది. వీటిలో రెండు రజతాలు. మరో రెండు కాంస్యాలు.
కాగా, సాహిల్ పథానియా (పురుషుల 100 కిలోల విభాగం), జినా దేవి చొంగథామ్ (మహిళల 78 కిలోలు), పరీక్షిత్ కుమార్ (పురుషుల +100 కిలోల విభాగం) కాంస్య పతకాల కోసం పోటీపడినప్పటికీ, పరాజయాలను ఎదుర్కొని నాలుగో స్థానాలతో తమ ప్రస్థానాన్ని ముగించారు.
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 69 కిలోల విభాగంలో ఓంకార్ అతారీ మూడో స్థానాన్ని సంపాదించాడు. 26 అతారీ ఆరంభంలో చక్కటి ప్రతిభ కనబరచినప్పటికీ, క్లీన్ అండ్ జెర్క్‌లో విఫలమైన కారణంగా కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మలేసియాకు చెందిన మహమ్మద్ హఫీఫీ మన్సూర్ మొత్తం 305 కిలో బరువునెత్తి స్వర్ణ పతకాన్ని సాధించాడు. నైజీరియా లిఫ్టర్ ఇనికా అయెనువా 301 కిలోలతో రజత పతకాన్ని, అతారీ 296 కిలోల బరువునెత్తి కాంస్య పతకాన్ని అందుకున్నారు.
ఏడో పతకాన్ని అందించిన పూనమ్
మహిళల 63 కిలోల విభాగంలో పూనమ్ యాదవ్ 202 కిలోల బరువునెత్తి కాంస్య పతకం సాధించింది. వెయట్‌లి ఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఏడో పతకం. గత ఏడాది జూనియ ర్ ఆసియా చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకున్న పూనమ్ కామనె్వల్త్ గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఒబియోమా ఒకోలీ, ఒలాయువాటొయన్ అడెసన్మీలకు గట్టిపోటీనిచ్చిం ది. అయతే వారిద్దరూ పూనమ్ కంటే ఐదు కిలోలు ఎక్కువ బరువునెత్తారు. పూనమ్ కాంస్య పతకాన్ని అందుకుంది.