Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్‌కు మరో ముగ్గురు భారత షూటర్లు.. రికార్డు స్థాయిలో 15మంది అర్హత!!

Indian shooters nail record 15 berths for Tokyo Olympics

దోహా: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. ఆదివారం ముగ్గురు భారత షూటర్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆదివారం జరిగిన పోటీల్లో అంగద్‌ వీర్‌ సింగ్‌ బజ్వా, మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ తమ ఈవెంట్లలో పతకాలు సాధించి భారత్‌కు మూడు ఒలింపిక్‌ బెర్త్‌లు అందించారు.

పురుషుల స్కీట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అంగద్ వీర్‌ సింగ్‌తో పాటు రజతం చేజిక్కించుకున్న మైరాజ్ అహ్మద్ ఖాన్ టోక్యో టికెట్ దక్కించుకున్నారు. ఒకే విభాగంలో ఇద్దరు ఒలంపిక్ బెర్త్‌లు సాధించడం విశేషం. పురుషుల 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ విభాగం ఫైనల్లో 449.1పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన 18 ఏళ్ల ప్రతాప్ సింగ్ కాంస్యం సాధించాడు.

షూట్ విభాగం ఫైనల్లో 56 పాయింట్లతో భారత షూటర్ల మధ్య టై కావడంతో స్వర్ణం కోసం షూటౌట్ జరుగగా.. అంగద్ 6-5తేడాతో అహ్మద్‌ను ఓడించి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రతాప్ సింగ్ కూడా బెర్త్ దక్కించుకోవడంతో.. విశ్వక్రీడల్లో చోటు దక్కించుకున్న భారత షూటర్ల సంఖ్య 15కు చేరింది. భారత చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో 12 మంది షూటర్లు పాల్గొనడమే ఇప్పటి వరకు రికార్డుగా ఉంది.

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఫైనల్స్‌లో భారత షూటర్లు మనూ బాకర్ - అభిషేక్ వర్మ జోడి స్వర్ణం సాధించగా.. ఫైనల్లో వారి చేతిలో ఓడిన సౌరభ్ చౌదరి - యశస్వి సింగ్ దేశ్వాల్ రజతంతో సరిపెట్టుకున్నారు.

శనివారం జరిగిన ఆసియా చాంపియన్‌షి మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ ఫైనల్లో మహిళా సీనియర్‌ షూటర్‌ తేజస్విని సావంత్‌ 435.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. పతకం చేజారినా.. తుది పోరుకు చేరడంతో ఆమెకు టోక్యో బెర్త్‌ దక్కింది. గత మూడు సార్లు (2008, 2012,20 16) అవకాశాలను చేజార్చుకున్న తేజస్విని ఈసారి ఆకట్టుకుంది.

Story first published: Monday, November 11, 2019, 10:22 [IST]
Other articles published on Nov 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+