Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాంకాక్‌లో భారత మహిళా షూటర్లకు అవమానం: ఆయుధాలున్నాయనే అనుమానంతో...

న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్లు హీనా సిద్ధూ, అంజలి భగవత్‌లకు బ్యాంకాక్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ ప్రపంచకప్ ముగించుకుని బ్యాంకాక్ నుంచి ముంబై బయలుదేరిన వీరిద్దరికీ ఆయుధాలు కలిగి ఉన్నారని విమానం ఎక్కేందుకు జెట్ ఎయిర్‌వేస్ అధికారులు అనుమతిని నిరాకరించారు.

ఆయుధాలకు సంబంధించి పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ), కస్టమ్స్ అధికారుల నుంచి అన్ని అనుమతులు ఉన్నా జెట్ ఎయిర్‌వేస్ భద్రతా విభాగం మేనేజర్ శైలేశ్ గాలా తమను కావాలనే ఇబ్బందులకు గురిచేశారని షూటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు 8 గంటల పాటు విమానాశ్రయంలోనే గడిపిన వారు భారత రైఫిల్ సంఘం జోక్యంతో ఎట్టకేలకు వేరే ఫ్లైట్‌లో న్యూఢిల్లీ మీదుగా ముంబై చేరుకున్నారు. నిజానికి ఆ షూటర్లు బుసాన్‌లో కొరియా ఎయిర్ ఫ్లైట్‌లో బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడ వారికి ఏ విధమైన సమస్యా ఎదురు కాలేదు.

Indian shooters barred from boarding flight, spend sleepless night in Bangkok

తాము జెట్ ఎయిర్‌వేస్ సెక్యూరిటీ మేనేజర్ శైలేష్ గాలాకు డిజిసిఎ అనుమతిని, కస్టమ్స్ క్లియరెన్స్‌ను చూపించామని, అయితే అతను తలబిరుసుతో వ్యవహరించాడని సిద్ధు టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పింది.

రాతపూర్వకంగా అనుమతిని నిరాకరిస్తున్నట్లు ఇవ్వాలని అడిగినా నిరాకరించాడని ఆమె చెప్పింది. తమకు భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+