
టోక్యో: ఒలంపిక్స్ 2021లో భారత మహిళా షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. కనీసం క్వాలిఫయింగ్ రౌండ్ కూడా దాటలేకపోయారు. శనివారం ఉదయం తిరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో అంజుమ్ ముద్గిల్, తేజస్విని సావంత్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. అంజుమ్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో 15వ స్థానంలో నిలిచింది. ఆమె మొత్తంగా 1167 స్కోర్ మాత్రమే చేసింది. మరో షూటర్ తేజస్విని 1154 స్కోర్‌తో ఏకంగా 33వ స్థానంలో నిలిచింది. కేవలం టాప్ 8 మంది షూటర్లు మాత్రమే ఈ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
50మీ రైఫిల్ 3 పొజిషన్స్ పోటీల్లో షూటర్ మూడు రకాలుగా టార్గెట్‌ను షూట్ చేస్తారు. మోకాళ్లపై కూర్చుని, పూర్తిగా పడుకుని, నిలబడి టార్గెట్‌ను షూట్ చేస్తారు. ఈ మూడు విభాగాల్లో టాప్-8లో నిలిచినవారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఆకాసా షూటింగ్ రేంజ్‌లో జరిగిన ఈవెంట్‌లో అంజుమ్ ముద్గిల్ మంచి స్టార్ట్ ఇచ్చింది. నీలింగ్‌లో పొజిషన్‌లో 400కు గాను 390 స్కోర్ చేసింది. ఇక ప్రోన్ పొజిషన్‌లో 395, స్టాండింగ్ పొజిషన్‌లో మాత్రం కేవలం 382 మాత్రమే స్కోర్ చేసింది. మొత్తంగా 1167 స్కోర్ చేసి 15వ స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్‌కు అర్హత సాదించలేకపోయింది.
తేజస్విని సావంత్ స్టాండింగ్ పొజిషన్‌లో 384, ప్రోన్ పొజిషన్‌లో 394, స్టాండింగ్ పొజిషన్‌లో 376 స్కోర్ చేసింది. మొత్తంగా తేజస్విని 1154 స్కోర్‌తో 33వ స్థానంలో నిలిచింది. తేజస్విని స్టాండింగ్ పొజిషన్‌లో ఎప్పుడూ నిరాశపరుస్తుంటుంది. ఒలంపిక్స్ 2021లోనూ మరోసారి అదే తప్పు పునరావృతం చేసి మూల్యం చెల్లించుకుంది.
మరోవైపు భారత స్టార్ బాక్సర్, ప్రపంచ నంబర్ వన్ అమిత్ పంఘాల్ 52 కేజీల విభాగం ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమిపాలయ్యాడు. దాంతో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. యుబెర్జెన్ మార్టినెజ్ చేతిలో అమిత్ 1-4 తేడాతో ఓడిపోయాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అమిత్‌పై భారీ అంచనాలు ఉండగా.. తొలి రౌండ్‌లో ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. రెండో రౌండ్‌లో మార్టినెజ్ పూర్తి ఆధిపత్యం చెలాయించి భారత అమిత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అప్పర్ కట్స్‌తో ఎదురుదాడి చేసి మనోడిని కోలుకోలేని దెబ్బతీశాడు. చివర్లో మరింత దూకుడుగా పంచులు కురిపించిన అతడు అమిత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.