Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎఫ్2 రేసులో తీవ్ర ప్రమాదం.. భారత రేసర్‌ అదృష్టవశాత్తూ..! (Video)

అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ ప్రి ఫార్ములా-2 రేసులో అనూహ్య సంఘటన జరిగింది. రేసు ఆరంభంలో సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయిన ఓ కారును ఆ వెనకాలే వచ్చిన రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భారత రేసర్ కుష్ మైనీ అదృష్టవశాత్తూ తప్పించుకోగలిగాడు. 23 ఏళ్ల కుష్ మొరాయించిన కారులో ఉన్నాడు.

ఇంజిన్‌లో సమస్య కారణంగా కుష్ మైనీ కారు స్టార్ కాకుండా.. రేసు స్టార్ట్ లైన్ వద్ద ఆగిపోయింది. దీంతో వెనుక నుంచి వచ్చిన రెండు కార్లు కుష్‌ కారును బలంగా ఢీకొట్టాయి. కార్లు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ ప్రమాదానికి గురైన ఇతర కార్లలో ఉన్న జోసెప్ మారియా, ఒలీవర్‌ గోత్‌లు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు.

Indian Racer Kush Maini Survives Horrifying Crash at Formula 2 Azerbaijan GP Feature Race

కారులో ఉన్న కుష్ బయటకు రాగలిగాడు. వైద్యులు పరీక్షించి కుష్‌ బాగానే ఉన్నాడని నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదంతో నిర్వాహకులు రేసును కాసేపు నిలిపివేశారు. ట్రాక్‌ను సిద్ధం చేసిన తర్వాత మళ్లీ రేసు కొనసాగించారు. డచ్‌ రేసర్‌ రిచర్డ్‌ విజేతగా నిలిచాడు. కానీ కుష్ మైనీపై నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.

స్టార్ సెటప్ ప్రొసిజర్ పాటించకుండా గ్రిడ్‌పై ప్రమాదానికి కారణమైన కుష్‌కు పది సెకన్ల పెనాల్టీ విధించారు. కానీ కుష్ ఈ రేసును పూర్తి చేయలేదు. దీంతో శిక్షణను మార్చారు. అయిదు స్థానాలు పెనాల్టీగా ఖరారు చేశారు. కుష్ పాల్గొనే తర్వాతి రేసులో ఈ శిక్ష అమలవుతుంది. కాగా, ఫార్ములా 2లో ఇన్‌విక్టా రేసింగ్ టీమ్‌కు కుష్ మైనీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకుముందు క్వాలిఫికేషన్లో కుష్ అయిదో స్థానంలో నిలిచాడు.

Story first published: Monday, September 16, 2024, 8:41 [IST]
Other articles published on Sep 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+