డిస్కస్ త్రో: ప్రపంచ రికార్డు నెలకొల్పిన యోగేశ్ కథునియా

హైదరాబాద్: భారత పారా అథ్లెట్ యోగేష్ కథునియా డిస్కస్ త్రోలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బెర్లిన్ వేదికగా జరిగిన పారా-అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో పురుషుల డిస్కస్ ఎఫ్36లో యోగేష్ కథునియా డిస్క్‌ను 45.18 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.
గతేడాది కుకింగ్ లి (చైనా, 42.96 మీ) నెలకొల్పిన రికార్డును యోగేష్ అధిగమించాడు. అతను మూడో ప్రయత్నంలో ఈ రికార్డు త్రో విసిరాడు. పావెల్ (35.63 మీ) రజతం గెలవగా... అలెగ్జాండర్ (19.24 మీ) కాంస్యం సాధించాడు.
బెర్లిన్‌లో జరిగిన ఈ పారా-అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి ఆదివారంతో ముగిసింది. ఇది తొమ్మిదవ పారా-అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి కావడం విశేషం.
Story first published: Tuesday, July 3, 2018, 10:40 [IST]
Other articles published on Jul 3, 2018
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications