డబ్బు కోసమే క్రికెట్ ఆటగాళ్లు ఫిక్సింగ్ చేస్తారా..!!

ఫిక్సింగ్ చేయడం వల్ల ఆటగాళ్లు కావాలనే ఓడిపోతారు. ఈ ఫిక్సింగ్ కూడా టీమ్ 'కెప్టెన్'ని దృష్టిలో పెట్టుకోని చేస్తారు. ఎందుకంటే టీమ్‌కి అతనే పెద్ద కాబట్టి. టీమ్‌లో కెప్టెన్ తో పాటు మరో ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను ఫిక్సింగ్ చేస్తే మ్యాచ్ గెలవడం అవతలి టీమ్‌కి సునాయసం అవుతుంది. ఈ ఫిక్సింగ్ భూతంలో గతంలో ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ మహామ్మద్ హాజరుద్దీన్, అజయ్ జడేజా ఉన్నట్లు మనం చూశాం.
ఫిక్సింగ్ చేసి అనంతరం కొర్టులో దొరికిపోయిన ఆటగాళ్లను మీరు ఎందుకు ఫిక్సింగ్ చేశారని ప్రశ్నించగా కేవలం డబ్బుకోసమేనని చెప్పడం కూడా మనం చూశాం. అంటే డబ్బు కోసం దేశ గౌరవాన్నే ఎక్కడైనా తాకట్టు పెడతారా... ఈ ఆటగాళ్లు. డబ్బులు తీసుకొని గేమ్‌ని ఫిక్సింగ్ చేసి, ఆ తర్వార క్రికెట్ నుండి నిషేధంపబడి, ఫిక్సింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో సరదాగా జలసాలు చేయడం పెద్ద ప్యాషన్ అయిపోయింది.
ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మండలి ద్వారా క్రికెట్ నిషేధానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్లు, సల్మాన్ బట్, మహమ్మద్ ఆమిర్, మహమ్మద్ ఆసిఫ్‌లకు విచారణలో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య గతేడాది ఓవల్‌లో జరిగిన టెస్టును ఫిక్స్ చేస్తే 1 మిలియన్ డాలర్లు (740,000 euros) ఇస్తానంటూ భారత్‌కు చెందిన బుక్‌మేకర్ లండన్‌కు చెందిన క్రికెటర్ల ఏజెంట్ మజహర్ మజీద్‌కు ఆఫర్ చేశాడు. పలువురు పాక్ ఆటగాళ్లకు ఏజెంట్‌గా వ్యవహరించిన మజీద్‌పై 'న్యూస్ ఆఫ్ ద వరల్డ్" రిపోర్టర్ మజహర్ మహమూద్ గతేడాది ఆగస్టు 21న స్టింగ్ ఆపరేషన్ జరిపాడు.
ఈ సందర్భంగా గుర్తు తెలియని భారత బుకీతో మజీద్ జరిపిన ఫోన్ సంభాషణను రికార్డు చేశాడు. స్పాట్ ఫిక్సింగ్‌పై జరుగుతున్న విచారణలో భాగంగా మంగళవారం లండన్ కోర్టు ఈ సంభాషణలను ఆలకించింది. ఈ సందర్భంగా ఓవల్ టెస్టులో పాక్ ఓడితే ఆటగాళ్లకు మిలియన్ డాలర్లు ఇస్తానంటూ భారత బుకీ ఒకరు మజీద్‌కు ఆఫర్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
సాధారణంగా ఆటగాళ్లకు మ్యాచ్‌కి, ఆటగాళ్ల గ్రేడింగ్‌ని బట్టి 30 లక్షల నుండి 40 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా మాత్రమే.. కానీ ఆటగాళ్లు ఒక్క మ్యాచ్‌కి ఫిక్సింగ్ చేస్తే సుమారు 5కోట్లవరకు ఇవ్వడం జరుగుతుందంట..ఇక ప్రతి నోబాల్‌కి 40వేల నుంచి 50 వేల పౌండ్ల సంపాదిస్తున్నారని మజీద్ స్టింగ్ ఆపరేషన్‌లో పేర్కొనడం జరిగింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications