బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియ్‌షిప్‌లో భారత అథ్లెట్లు పలు సతకాలు సాధించారు. భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్‌కు ఈ పోటీల్లో రజతం దక్కింది. అలాగే తన అద్భుతమైన ప్రదర్శనతో పతకంతోపాటు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బెర్త్ కూడా అతను ఖాయం చేసుకున్నాడు. ఈ బెర్తు కన్ఫర్మ్ చేసుకున్న తొలి భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచాడు.
ఈ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పోటీల్లో భారత అథ్లెట్లు ఓ స్వర్ణం, 3 రజతాలు, ఓ కాంస్యంతో కలిపి 5 పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. పురుషుల లాంగ్‌జంప్‌లో యు టాంగ్ లిన్ (చైనీస్ తైపీ) 8.40 మీటర్లు దూకి స్వర్ణం సాధించగా, 24 ఏళ్ల మురళి 8.37 మీటర్లు దూకి రెండో స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే 8.27 మీటర్లు జంప్ చేయాలి. దాన్ని మురళీ దాటేయడంతో అతనికి ఒలింపిక్స్ బెర్త్ కన్ఫర్మ్ అయింది.

ఇక 4-400 మిక్స్‌డ్ రిలేలో రాజేష్, ఐశ్వర్య, జాకోబ్, వెంకటేశన్‌తో కూడిన భారత బృందం అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ రేసును కేవలం 3 నిమిషాల 14.70 సెకన్లలో పూర్తి చేసిన ఈ బృందం స్వర్ణం సాధించింది. అలాగే పురుషుల హైజంప్‌లో సర్వేష్ అనిల్ రజతంతో ఆకట్టుకున్నాడు. హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ రజతం సాధించింది.
పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన సంతోష్ కాంస్య పతకం నెగ్గాడు. ఇప్పటికే 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలుగు అథ్లెట్ యర్రాజీ జ్యోతి స్వర్ణంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఆమె అదే జోరులో 200 మీటర్ల రేసులో కూడా ఫైనల్స్ చేరుకుంది. ఇలా భారత క్రీడాకారులు పతకాలు సాధించడంపై అభిమానులు, మాజీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.