దక్షిణాసియా గేమ్స్ ఒకేరోజు 4 పతకాలు నెగ్గిన భారత్

హైదరాబాద్: 13వ దక్షిణాసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. టోర్నీలో భాగంగా రెండో రోజైన మంగళవారం భారత అథ్లెట్లు నాలుగు పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో జరిగిన 1500 మీటర్ల పరుగు పోటీలో అజయ్ కుమార్ సారో స్వర్ణ పతకం నెగ్గాడు.
దశరధ్ స్టేడియంలో 1500 మీటర్ల పరుగు పందెంలో అజయ్ కుమార్ 3.54.18 సెకన్లలో పూర్తి చేయగా... అజీత్ కుమార్ 3.57.18 సెకన్లతో పూర్తి చేసి రజతం గెలిచాడు. ఇక, నేపాల్ అథ్లెట్ టంకా కార్కి (3.50.20 సెకన్లు) కాంస్య పతకం నెగ్గాడు.
అంతకముందు జరిగిన మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో చందా (4.34.51 సెకన్లు) రజత పతకం కైవసం చేసుకుంది. చిత్రా పలకీజ్ (4.35.46 సెకన్లు) కాంస్య పతకం నెగ్గింది. శ్రీలంక అమ్మాయి ఉడా కుబురలగె (4.34.34 సెకన్లు) స్వర్ణ పతకం సాధించింది.
ప్రస్తుతం భారత్ 21 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలు సాధించింది. ఇక, ఈ దక్షిణాసియా గేమ్స్‌కు ఆతిథ్యమిస్తున్న నేపాల్ 28 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications