
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో ఆరో రోజు భారత్.. కొన్ని విజయాలను రుచి చూసింది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎప్పట్లాగే తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. గ్రూప్ స్టేజీలో మరో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో అర్చరీలో భారత్ విలుకారుడు ప్రవీణ్ జాదవ్.. తన సత్తా చాటాడు. పురుషుల వ్యక్తిగత ఎలిమినేషన్ 1/32 రౌండ్‌ను అతను ఏకపక్షంగా మార్చివేశాడు.
ఈ రౌండ్‌లో తన ప్రత్యర్థి, రష్యన్ ఒలింపిక్స్ కమిటీకి చెందిన గల్సన్ బజార్ఝపోవ్‌పై అద్వితీయమైన విజయాన్ని అందుకున్నాడు. 6-0 పాయింట్లతో 1/16 రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. ఇదే కేటగిరీలో భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్ పరాజయం పాలవడంతో ఆశలు అడుగంటాయి. తరుణ్‌దీప్ ప్రస్థానం ముగిసిన వెంటనే ఆరంభమైన వ్యక్తిగత 1/32 కేటగిరీలో అంచనాలకు మించిన స్థాయిలో రాణించాడు ప్రవీణ్ జాదవ్. తొలుత ప్రవీణ్ జాదవ్ తొలి రౌండ్ తొలి సెట్‌ను ప్రారంభించాడు. వరుసగా 10,9,10 పాయింట్లను సాధించాడు.
అనంతరం గుల్సన్ బజార్ఝపోవ్ విల్లును అందుకున్నాడు. ప్రవీణ్ జాదవ్‌తో పోటీ పడుతూ పాయింట్లను అందుకోలేకపోయాడు. 9,9,9 తో సరిపెట్టకున్నాడు. ఈ సెట్‌లో ప్రవీణ్ జాదవ్ 29 పాయింట్లను సాధించగా. ఆర్‌ఓసీ అర్చర్ 27 పాయింట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగాడు. రెండో రౌండ్‌లో ఇద్దరి మధ్యా హోరాహోరీ పోరు సాగింది. ప్రవీణ్ జాదవ్ 9,9,10 పాయింట్లను సాధించగా.. గుల్సన్ బాజర్ఝపోవ్ 10,10,7 వద్దే పరిమితం అయ్యాడు.
ఈ సెట్‌లో కూడా ఒక పాయింట్‌ను అదనంగా సాధించగలిగాడు ప్రవీణ్ జాదవ్. మూడో సెట్‌లో ప్రవీణ్ జాదవ్‌కు ఎదురు లేకుండా పోయింది. ఈ సెట్‌లో గుల్సన్ 8,7,9 పాయింట్లను ఆర్జించగా.. ప్రవీణ్ కుమార్ చెలరేగాడు. 9,9తో మ్యాచ్‌ను తనవైపునకు లాక్కోగిలిగాడు. ఈ మూడు సెట్లల్లో ప్రవీణ్ జాదవ్ తొలి సెట్‌లో 29, 28, 28 పాయింట్లను సాధించాడు, ఆ వెంటనే సాగిన రెండు, మూడు రౌండ్లలో అతని హవా కొనసాగింది. ఆర్వోసీ ప్లేయర్ ఆశించిన పాయింట్లను దక్కలేదు. 9,910 పాయింట్లో 1/16రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.