For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్, దక్షిణాఫ్రికాపై భారత్ ప్రతీకారం

By Pratap
India
దర్బన్: హైదరాబాద్ బ్యాట్స్ మన్ వివియస్ లక్ష్మణ్ మరోసారి భారత్ ను అదుకున్నాడు. దక్షిణాఫ్రికాపై జరిగిన రెండో టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్సులో లక్ష్మణ్ నిలకడగా ఆడి 96 పరుగులు చేయడంతో భారత్ దక్షిణాఫ్రికా ముందు 303 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. మిగతా పని బౌలర్లు పూర్తి చేయడంతో భారత్ రెండో టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

దీంతో దక్షిణాఫ్రికాపై భారత్ 1-1 స్కోరుతో సిరీస్ ను సమం చేసింది. తొలి టెస్టు మ్యాచులో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. బౌలర్లు రాణించండతో భారత్ రెండో టెస్టు మ్యాచులో 87 పరుగుల ఆధిక్యతతో గెలిచింది. జహీర్, శ్రీశాంత్ మూడేసి వికెట్లు తీసుకోగా, హర్భజన్ కు రెండు వికెట్లు లభించాయి. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సులో 131, రెండో ఇన్నింగ్సులో 215 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్సులో 205, రెండో ఇన్నింగ్సులో 228 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పకుండా భారత బౌలర్లు జాగ్రత్త వహించారు. దక్షిణాఫ్రికా వికెట్లను కూలుస్తూ పోయారు. లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్సులో 182 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. భారత్ పై విజయం సాధించాలంటే మరో 121 పరుగులు చేయాల్సి ఉంది. అయితే వికెట్లు చేతులో లేకపోవడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. జహీర్ ఖాన్ తన సత్తా చాటాడు.
స్కోరు బోర్డు
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+