
హైదరాబాద్: వుషూ సాండా ఏషియన్ కప్ (డబ్ల్యూఎస్ఏసీ) నేపథ్యంలో జరిగిన పోటీల్లో మొత్తం భారత్‌కు పది పతకాలు దక్కాయి. కుంగ్ ఫూ క్రీడల్లో ఒకటైన ఈ వుషూకు భారత్ నుంచి వెళ్లిన క్రీడాకారుల్లో మహిళలకు అయిదు, పురుషులకు అయిదు పతకాలు వచ్చాయి.
బరువును బట్టి విభాగాలును కేటాయించగా కేజీల వారీగా గెలుచుకున్న వారు ఇలా ఉన్నారు.
ప్రవీణ్ (48 కేజీలకి ), ముఖేష్ (70 కేజీలకి ), రాజేందర్ (90 కేజీలకి ), అరుణ్‌పమ దేవి (60 కేజీలకి ), మాలిక్ (70 కేజీలకి ) రజతాలు సాధించగా.. ఉచిత శర్మ (52 కేజీలకి ), బుద్ధచంద్ర (56 కేజీలకి ), రజని (75 కేజీలకి ), సంతోషిదేవి (52 కేజీలకి ), పూజ (65 కేజీలకి ) కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.