Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి వన్డే: పాక్ పై భారత సునాయస విజయం


Yuvraj Singh & Dhoniగౌహతి: పాకిస్తానుపై భారత తొలి క్రికెట్ వన్డే మ్యాచులో విజయం సాధించి సిరీస్ లో శుభారంభం చేసింది. 240 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 47 ఓవర్లలో ఛేదించింది. పాకిస్తానుపై భారత్ 5 వికెట్లతో సునాయస విజయం సాధించింది.

కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ అర్థ సెంచరీలు సాధించి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. నాలుగో వికెట్ భాగస్వామ్యానికి వారిద్దరు 105 పరుగులు జోడించారు. యువరాజ్ సింగ్ 58 పరుగులు చేసి అబ్దుర్ రెహ్మాన్ బౌలింగులో భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. ధోని 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షోయబ్ అక్తర్ బౌలింగులో అవుటయ్యాడు. ధోనీకి ఇది వన్డేల్లో 17వ అర్థ సెంచరీ కాగా, యువరాజ్ కు 31వ అర్థ సెంచరీ. పాకిస్తాన్ 3 క్యాచ్ లు వదిలేసింది. ఇది భారత్ కు బాగా కలిసి వచ్చింది.

భారత్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రూపంలో ఆదిలోనే దెబ్బ తగిలినా గంభీర్, గంగూలీ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సచిన్ టెండూల్కర్ నాలుగు పరుగులు చేసి అక్తర్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగుకు వచ్చి గంభీర్ గంగూలీతో కలిసి చక్కటి ఆటతీరును ప్రదర్శించాడు. గంగూలీ 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రన్నవుట్ కాగా, గంభీర్ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఫ్రిదీ బౌలింగులో పెవిలియన్ దారి పట్టాడు. వీరిద్దరు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. జహీర్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ల్లో యూసుఫ్ 83 పరుగులు చేయగా, సల్మాన్ భట్ 50 పరుగులు చేశాడు. ఆఫ్రిదీ 31 పరుగులు చేశాడు.
Story first published: Monday, November 5, 2007, 23:53 [IST]
Other articles published on Nov 5, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+