Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుంది

India will perform better at Tokyo Olympics: Kiren Rijiju

టోక్యో ఒలింపిక్స్‌-2020కి భారత్ నుండి ప్రతిభావంతులతో కూడిన బృందాన్ని పంపిస్తాం. అక్కడ భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుంది అని కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కిరణ్‌ రిజుజు క్రీడల గురించి మాట్లాడారు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

'టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తాం. రియో 2016 ఒలింపిక్స్‌లో కేవలం రెండు పతకాలు మాత్రమే సాధించాం. ఆ ఒలంపిక్స్‌ అనంతరం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ చాలా ముఖ్యమైన సూచనలతో ముందుకు వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మన అథ్లెట్స్‌ అద్భుతంగా రాణిస్తున్నారు అని మంత్రి కిరణ్‌ రిజుజు అన్నారు.

'క్రీడలను ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలి. మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన సాయాన్ని కేంద్రం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది' అని కిరణ్‌ రిజుజు అన్నారు. టోక్యోలో వచ్చే ఏడాది జులై 24న ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Story first published: Friday, July 26, 2019, 8:26 [IST]
Other articles published on Jul 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+