Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రవీణ్ కుమార్‌ను మిస్సవుతున్నాం: మహేంద్ర సింగ్ ధోనీ

Mahendra Singh Dhoni
బెంగళూరు‌: ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్‌ ప్రపంచ కప్ పోటీలకు దూరం కావడం పట్ల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆవేదన వ్యక్తం చేశాడు. స్ట్రీట్ స్మార్ట్ ప్రవీణ్ కుమార్‌ను తాము మిస్సవుతున్నామని అతను గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నాడు. మోచేతి గాయం కారణంగా ప్రవీణ్ కుమార్‌ను ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ కుమార్ ప్రపంచ కప్ పోటీలకు దూరం కావడం దురదృష్టకరమని ధోనీ అన్నాడు. వన్డేల్లో నిలకడగా ప్రవీణ్ ఆడుతున్నాడని, ప్రవీణ్ లోటు అత్యంత దురదృష్టకరమని అతను అన్నాడు. అయితే, క్రీడాకారులు గాయపడకుండా ఆపలేమని అతను అన్నాడు.

మిగతా ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుంటున్నారని, ఈ నెల 19వ తేదీన బంగ్లాదేశ్‌తో తాము ఆడే తొలి మ్యాచు నాటికి వారు పూర్తిగా కోలుకుంటారని ధోనీ వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్‌ల పేర్లు చెప్పకుండా వ్యాఖ్యానించాడు. కొంత మంది ఆటగాళ్లు చిన్నపాటి సమస్యలతో బాధపడుతున్నారని, అది తీవ్రమైన విషయం కాదని, అటువంటిది ఎప్పుడూ ఉంటుందని అతను చెప్పాడు. మ్యాచుల మధ్య సమయం ఉంటే సమస్యల నుంచి బయట పడడానికి వీలవుతుందని అతను భారీ ప్రపంచ కప్ షెడ్యూల్‌పై వ్యాఖ్యానించాడు. ప్రస్తుత షెడ్యూల్ పట్ల తనకు సంతోషంగానే ఉందని అతను చెప్పాడు. ప్రపంచ కప్ పోటీల్లో భారత్ గెలుస్తుందని అతను దీమా వ్యక్తం చేశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+