ధోనికి దలైలామా షేక్ హ్యాండ్, ఆశీస్సులు (ఫోటోలు)
న్యూఢిల్లీ: భారత్, వెస్టిండిస్ క్రికెటర్లు శుక్రవారం టిబెట్ ఆధ్యాత్మక గురువు దలైలామా ఆశీస్సులు అందజేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియంలో నాల్గవ వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లు కెప్టెన్ ధోని, ఓపెనర్ శిఖర్ ధావన్, సురేష్ రైనాతో పాటు వెస్టిండిస్‌కు చెందిన డ్వేన్ బ్రేవోతో పాటు, పలువురు ఆటగాళ్లు దలైలామా ఆశీస్సులు తీసుకున్నారు.
ధర్మశాలలో మ్యాచ్ సందర్బంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శనలు క్రికెట్ అభిమానులను అలరించాయి. వెస్టిండిస్‌తో జరుగుతున్న నాల్గవ వన్డేలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.
కోహ్లీ 114 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులు కొట్టడంతో 127 పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఇది 20వ శతకం కావడం విశేషం.

క్రికెటర్లకు దలైలామా ఆశీస్సులు
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆధ్యాత్మిక గురువు దలైలామాతో టీమిండియా కెప్టెన్ ధోని కరచాలనం.

క్రికెటర్లకు దలైలామా ఆశీస్సులు
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆధ్యాత్మిక గురువు దలైలామాకి నమస్కరిస్తున్న ఓపెనర్ శిఖర్ ధావన్

క్రికెటర్లకు దలైలామా ఆశీస్సులు
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆశీస్సులు తీసుకుంటున్న వెస్టిండిస్ ఆటగాడు బ్రేవో.

క్రికెటర్లకు దలైలామా ఆశీస్సులు
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆశీస్సులు తీసుకుంటున్న వెస్టిండిస్ ఆటగాడు బ్రేవో.

క్రికెటర్లకు దలైలామా ఆశీస్సులు
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆశీస్సులు తీసుకుంటున్న వెస్టిండిస్ కెప్టెన్ డ్వేన్ బ్రేవో. వెస్టిండిస్ జట్టు తరుపున దలైలామాకు టీషర్ట్ బహుకరించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications