కివీస్ తో మొదటి టెస్టు డ్రా: ఆదుకున్న హర్భజన్ సింగ్, లక్ష్మణ్

మొదటి ఇన్నింగ్సులో భారత్ 487 పరుగులు చేసింది. వీరేంధ్ర సెహ్వాగ్ 173, రాహుల్ ద్రావిడ్ 104, సచిన్ 40, లక్ష్మణ్ 40, హర్భజన్ 69 పరుగులు చేశారు. రెండోరోజు మధ్యాహ్నానికి అందరూ అవుటవడంతో న్యూజిలాండు మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే అందుకు ధీటుగా న్యూజిలాండు మొదటి ఇన్నింగ్సులో 459 పరుగులు చేసింది. రైడర్ 103, విలియమ్సన్స్ 131 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్సులో న్యూజిలాండు తరఫున వెటోరి 4, జితిన్ పటేల్ 3 వికెట్లు తీయగా, భారత్ తరఫున ఓజా 4 వికెట్లు తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్సు పూర్తయ్యే సరికి భారత్ 28 పరుగుల ఆధిక్యంలో ఉంది.
28 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్సును ప్రారంభించిన భారత్ బాగా ఆడితే గెలుస్తుందని అందరూ ఊహించారు. అయితే మన ఆగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ గంభీర్(0), సెహ్వాగ్(1), ద్రావిడ్(1), సచిన్(12), రైనా(0) ధోనీ(22)కు టపటపా వికెట్లు పడేసుకొని భారత్ క్రీడాభిమానులను నిరాశలో ముంచారు. ఓ దశలో 15 పరుగులకో 5 వికెట్లు కోల్పోయిన భారత్ అతితక్కువ పరుగులు చేసిన టీంగా రికార్డు సృష్టిస్తుందేమోనని అందరూ భయపడ్డారు. బౌలర్ మార్టిన్ ఆదివారం వెంటవెంటనే భారత్ అగ్రశ్రేణి ఆటగాళ్ల వికెట్లు తీసి భారత్ కు ముచ్చెమటలు పట్టించాడు. మొదటి 6 వికెట్లలో 5 వికెట్లు మార్టిన్ వే కావడం గమనార్హం.
అయితే తన ఆటతో ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లుజల్లే వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ మళ్లీ భారత్ ను ఓటమినుండి గట్టెక్కించాడు. నిలకడగా అడుతూ తన వికెట్ ను కాపాడుకున్నాడు. ధోనీ ఔటయిన తర్వాత లక్ష్మణ్ కు జోడీగా వచ్చిన హర్భజన్ సింగు కూడా లక్ష్మణ్ కు తోడయ్యాడు. లక్ష్మణ్ వికెట్ కాపాడుకుంటూ సంయమనంతో అడగా, హర్భజన్ దూకుడుగా అడాడు. ఇద్దరు కలిసి ఇన్నింగును డ్రా దిశగా తీసుకు వెళ్లారు. లక్ష్మణ్ సెంచరీకి 9 పరుగుల దూరంలో 91 పరుగుల వద్ద అవుటుకాగా, హర్భజన్ సింగ్ 115 పరుగులు చేసి తన కెరీర్లో మొదటి సెంచరీ చేశాడు. ఆ తర్వాత అవుటయ్యాడు. లక్ష్మణ్, హర్భజన్ ల వల్ల భారత్ 266 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగు తర్వాత భారత్ 294 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ గెలవాలంటే 295 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ లంచ్ విరామం తర్వాత కూడా ఆడటంతో న్యూజిలాండ్ సమయం లేకపోయింది. రెండో ఇన్నింగులో న్యూజిలాండు 22 పరుగులు చేసి ఒక వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత మ్యాచ్ ని డ్రాగా ప్రకటించారు. రెండు ఇన్నింగ్సులలో అసమాన ప్రతిభ కనబర్చిన హర్భజన మాన్ ఆఫ్ ది మాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications