Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISSF: జూనియర్ వరల్డ్ కప్ రైఫిల్/పిస్టల్/షాట్‌గన్ 2025కు అతిథ్యం ఇవ్వనున్న భారత్..

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) జూనియర్ వరల్డ్ కప్ రైఫిల్/పిస్టల్/షాట్‌గన్ 2025 ఇండియాలో నిర్వహించనున్నారు. దీని నిర్వహణతో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. 2023లో భోపాల్‌లో సీనియర్ ప్రపంచ కప్ జరిగింది. ఈ సంవత్సరం ISSF ప్రపంచ కప్ ఫైనల్ ఇండియాలోనే జరిగింది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) జూనియర్ వరల్డ్ కప్ సంబంధించి శుక్రవారం (డిసెంబర్ 20) ISSF నుండి NRAI అధికారిక ధృవీకరణ పత్రాన్ని స్వీకరించింది.

తాము గత నెలలో రోమ్‌లో ISSF కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించినట్లు NRAI అధ్యక్షుడు కాళికేష్ నారాయణ్ సింగ్ డియో చెప్పారు.సభ్య సమాఖ్యలు అలాగే ISSF ప్రెసిడెంట్ లూసియానో ​​రోస్సీ భారతదేశం అత్యుత్తమ అంతర్జాతీయ షూటింగ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తుందని పేర్కొన్నారు. క్రీడను అభివృద్ధి చేయడంలో సహాయపడుతున్న తీరును ఆయన ప్రశంసించారు. జూనియర్ వరల్డ్ కప్ రైఫిల్/పిస్టల్/షాట్‌గన్ 2025 నిర్వహించడానికి అధికారిక ధృవీకరణ వచ్చినందని తెలిపారు.

India to host Junior World Cup Rifle Pistol Shotgun 2025

దేశంలో క్రీడను అభివృద్ధి చేసేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రయత్నాలకు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది గత దశాబ్దంలో భారతదేశంలో జరిగిన తొమ్మిదో టాప్ లెవల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ అయితే మొదటి ISSF జూనియర్ ప్రపంచ కప్ అని వివరించారు. గతంలో భారతదేశంలో కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లు, ఆరు ISSF పోటీలు జరిగాయి. ఇందులో నాలుగు సీనియర్ ISSF ప్రపంచ కప్‌లతో పాటు రెండు ప్రపంచ కప్ ఫైనల్ పోటీలు ఉన్నాయి.

Story first published: Sunday, December 22, 2024, 9:03 [IST]
Other articles published on Dec 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+