
ఒలింపిక్స్ ముగిశాయి, భారత జట్టు స్వదేశానికి తిరిగి వచ్చింది. ఏడు పతకాల చారిత్రక విజయంతో భారత్ తిరిగి వచ్చింది. చాలామందికి నిరాశ కలిగించినప్పటికీ, ఈసారి భారత ప్రదర్శన మెరుగుపడింది. భారతదేశానికి గొప్ప ఆరంభం అని చెప్పాలి. మొదటి రోజునే మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్‌లో మెరిసింది. భారతదేశం తరపున రజతం సాధించింది మరియు భారతదేశం గర్వపడేలా చేసింది. మొదటి రోజు, షూటర్లు సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, ఎలెవన్ వాలరివన్ మరియు అపూర్వీ చండేలా కూడా పోటీలో నిలిచారు.
క్వాలిఫైయింగ్ రౌండ్‌లో సౌరభ్ చౌదరి ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే, అతను ఫైనల్లో ఏడో స్థానంలో నిలిచాడు. సౌరభ్ కూడా ఇతర షూటర్ల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాభాయ్ భారత్ తరపున రజత పతకం సాధించింది. 2000 ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం గెలిచిన తర్వాత ఈ విభాగంలో భారతదేశానికి తొలి పతకాన్ని అందించిన ఘనత మీరాబాయ్ చానుకు దక్కింది.. ఆమె మొత్తం 202 కిలోల బరువును ఎత్తింది. మొదటి ప్రయత్నంలో 87 కిలోలు మరియు రెండవ రౌండ్‌లో 115 కిలోలు బరువును ఎత్తింది. రియో ఒలింపిక్స్‌లో సాధించలేని బాధ ఇప్పుడు తుడుచుపెట్టుకుపోయిందని వ్యాఖ్యానించింది.
ఫెన్సింగ్‌లో తొలిసారిగా భారత్ నుంచి భవానీ దేవీ ప్రాతినిథ్యం వహించింది. ఆమె ట్యునీషియాకు చెందిన నదియా బెన్ అజీజీని ఓడించారు. ఇక ఆ తర్వాత ముందుకు సాగలేకపోయినప్పటికీ, రాబోయే రోజుల్లో కచ్చితంగా భారత్‌కు ఒక ఆషాకిరణంగా భవానీ దేవీ నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ఛాంపియన్ ఓ జిన్యెక్‌ను అతాను దాస్ పడగొట్టడం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.. మిగిలిన ఆర్చర్లు నిరాశ పర్చారు. మరో నిరాశపరిచే ఫలితం ఏమిటంటే, మేరీ కోమ్ మొదటి రౌండ్‌లో ఓడిపోయారు. ఆమె ఒలింపిక్స్ నుంచి రిటైర్ అయ్యారు.
ఇక మరోసారి ప్రస్తావించాల్సిన విషయం బాక్సర్ లావెలినా బోర్గోహీన్. క్వార్టర్ ఫైనల్స్‌లో తైవాన్‌కు చెందిన నీన్ చిన్ చెన్‌ను ఓడించింది. ఆమె సెమీస్‌లో ఓటమిపాలైంది. కానీ మూడో స్థానం కోసం జరిగిన పోరులో విజయం సాధించింది. విజేందర్ మరియు మేరీ కోమ్ తరువాత, లోవెలినా పతకం గెలుచుకున్న బాక్సర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.
బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో ఒలింపిక్ పతకం సాధించి సింధు మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈసారి, సింధు హీ బింగ్ జావోను ఓడించింది. కాంస్య పతకం దక్కించుకుంది. ఇక పురుషుల జట్టు కాంస్యం గెలుచుకుంది. మహిళల జట్టు కూడా నాల్గవ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఓటముల తర్వాత ఇరు జట్లు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఈసారి రవికుమార్ దహియా రెజ్లింగ్‌లో స్టార్‌గా నిలిచాడు. వినేష్ ఫోగట్ మరియు ఇతరులు నిరాశపర్చారు. కుస్తీలో భజరంగ్ పూనియా కాంస్యం సాధించాడు. ఫైనల్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడం ద్వారా భారత్ టోక్యోలో ఒలింపిక్స్‌ను విజయంతో ముగించింది.. టోక్యోలో భారత విజయం వెండితో మొదలై స్వర్ణంతో ముగిసింది.